DailyDose

విజయవాడలో 144 సెక్షన్-తాజావార్తలు

144 Section Enforced In Vijayawada

* అమరావతి రైతుల ఆందోళన ఉద్ధృతమవుతున్న తరుణంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. విజయవాడలో 144 సెక్షన్ విధించారు. నిన్నటి నుంచే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు, నిరసనలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితి చేసిన ఆందోళనల కారణంగా శాంతి భద్రతలకు భంగం కలిగిందన్న పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం కలిగినట్టు చెప్పారు. పెళ్లిళ్లకు, శుభ కార్యక్రమాలకు కిరాయికి ఇవ్వాల్సిన ఫంక్షన్ హాలును నిరసనలు చేసుకునేందుకు ఇచ్చారన్న పోలీసులు.ఆ ఫంక్షన్ హాల్ కు అనుమతి రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విజయవాడలో నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని.. విజయవాడ పటమట పోలీసులు ప్రకటించారు.
*కృష్ణ జిల్లా కైకలూరు పట్టణంలో ని నేషనల్ స్కూల్ లో అమ్మఒడి పధకం కార్యక్రమం ప్రారంభించడానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే దూలం. నాగేశ్వరరావు కు షుమారు వెయ్యి మంది విద్యార్థులు సిఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి మాస్కులు ధరించి ఘనస్వాగతం పలికారు
* ప్రయాణసాధనాలను కిటకిటలాడిస్తోంది. విశాఖ వైపు వచ్చే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు 3 నెలల ముందుగానే భర్తీ అయ్యాయి. గోదావరి ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లకు స్లీపర్ క్లాస్లో 600 వరకు వెయిట్ లిస్ట్తో రిగ్రెట్ వెయిట్లిస్ట్ సమాచారం దర్శనమిస్తోంది. ఇక హైదరాబాద్కు తిరుగు ప్రయాణంలో 19వ తేదీ ఆదివారం నాటికి విమానం టిక్కెట్టు ధర ఇప్పుటికే రూ.18 వేలకు చేరుకుంది.
*బడ్జెట్ సెషన్ జనవరి 31 నుంచి ఏఫ్రిల్ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫార్సు చేసింది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న సీసీపీఎ తొలిదశను జనవరి 31 నుంచి ఏప్రిల్ 11 వరకు రెండో దశను మార్చి 2నుంచి ఏప్రిల్ 3 వరకు పేర్కొన్నట్లు బుధవారం సంబందిత వర్గాలు తెలిపాయి.
* గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం లో భూకంపం గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామం నందు భూకంపం భయపడుతున్న గ్రామ ప్రజలు.
* సత్తెనపల్లి తహశీల్దార్ కార్యాలయం పై ఎసిబి దాడిభూమి కోలతలకు లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ రాజు, చైన్ మ్యాన్ చిత్రంజన్.బాధితుడు శ్యామల రెడ్డి నుండి 27వేలు లంచం తీసుకుంటు రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డ సర్వేయర్..
* నరసరావుపేట పట్టణ శివారు ప్రాంతాల విలీన ప్రక్రియ లో చిన్న పొరపాటు జరిగింది. కలెక్టర్ ద్వారా సరిదిద్దేందుకు ప్రభుత్వానికి నివేదిక అందించాం త్వరలో కొత్త జీఓ వస్తుంది.
* వైఎస్‌ వివేకా హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌లకు నోటీసులు జారీపూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశంతదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా
* సిక్కోలుకి చేరుకున్న పాకిస్థాన్ నుంచి విడుదలైన 15 మంది మత్స్యకారులు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను కలిసి మత్స్యకారులు తాము పాకిస్తాన్ లో బంధీలుగా ఉన్న సమయంలో తమ కుటుంబాలకు అండగా నిలిచినందుకు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన మత్స్యకారులు
* సీబీఐ కోర్టు వద్ద బందోబస్తుకు పోలీసుల కసరత్తుఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణ పోలీసులకు అందిన లేఖఅక్రమాస్తుల కేసు విచారణలో రేపు సీబీఐ కోర్టుకి హాజరుకానున్న ఏపీ సీఎం జగన్, విజయసాయిరెడ్డి.
* విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి సమావేశమైంది. వేదిక కల్యాణ మండపం వద్ద జరుగుతున్న ఈ సమావేశానికి తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలకు నిరసనగానే పాదయాత్ర చేపట్టనున్నట్లు ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి తెలిపారు.
* విజయవాడలో అఖిలపక్షం నేతల అరెస్టుకు నిరసనగా ఆందోళన దిగిన టీడీపీ నేతలు, వామపక్ష పార్టీలుటవర్ క్లాక్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద బైఠాయించిన మాజీ మంత్రులు పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యేలుఅనంతపురంలో శారదా బాలికల పాఠశాలలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన మంత్రి శంకరనారాయణజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలుదిశ చట్టంపై అవగాహన కోసం నగరంలో భారీ ర్యాలీ.. హాజరైన మంత్రి శంకరనారాయణ, జిల్లా కలెక్టర్, ఎస్పీగత రాత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే ఉషాశ్రీ వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ నేతలుఎన్.ఆర్.సీ బిల్లుకు మద్దతుగా జనజాగరణ సమితి, బీజేపీ నేతలు అనంతపురంలో భారీ ప్రదర్శన
* విజయవాడలో నిన్న తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ గురువారం విశాఖలో తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా నేతలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్‌ కుమార్‌, గణబాబుతో పాటు పలువురు నేతలు మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును అడుగడునా అడ్డుకోవడం తగదన్నారు.
* సంక్రాంతి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. మొదట ఈ నెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ..ఇవాళ(బుధవారం) 11న రెండో శనివారం స్కూళ్లకు సెలవు ఉండదని స్పష్టం చేసింది.
* శేరిలింగంపల్లి సర్కిల్‌ -20 కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య, అసిస్టెంట్‌ సాయి కలిసి ఓ వ్యక్తి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
* విశాఖ నగరంలో ఎన్టీఆర్‌ విగ్రహం మాయమైంది. దీనిపై తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పీఎంపాలెం పోలీసులకు బుధవారం ఫిర్యాదుచేశారు. మధురవాడ మార్కెట్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కొందరు పెకలించి పట్టుకుపోయారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
* ఆంధప్రదేశ్ రాజధాని పై రాష్ట్ర హై కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులేవీ జారీ చేయనప్పుడు..ఆ అంశంలో తాము ఎలా జ్యోకం చేసుకోగలమని ప్రశ్నించింది. ఈ తరుణంలో తరలింపును సవాలు చేస్తూ దాఖలయ్యే పిటిషన్స్ అన్ని కూడా పనికిరాని అపరిపక్వమైనవే అవుతాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని అంశం పై తక్షణమే హై కోర్ట్ జ్యోకం చేసుకోవాలని గుంటూరుకి చెందిన న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు పిటిషన్ దాఖలు చేసారు.
* పాకిస్థాన్‌ నుంచి విడుదలైన 15 మంది మత్స్యకారులు గురువారం సిక్కోలుకి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ను కలిశారు. తాము పాకిస్తాన్‌ లో బందీలుగా ఉన్న సమయంలో తమ కుటుంబాలకు అండగా నిలిచినందుకు కలెక్టర్‌కు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్‌ లో అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఒక పక్క ఆందోళనలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. మరోవైపు రాజధానిని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయాలంటూ.. ఆ జిల్లా కాంగ్రెస్‌ నేతలు సరికొత్తగా ఆందోళనను లేవనెత్తారు. గురువారం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీపతి సతీశ్‌ ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
* ప్రతి గ్రామాన మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన ధ్యేయం మంత్రి పేర్ని.బందరు మండలం చిన్న కగ్రహారం క్యాంబిల్ పేటలోని తాగునీరు, సిసి రోడ్లకు ఈరోజు రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని) శంకుస్థాపన చేశారు.
* గాంధేయపద్ధతిలో నిరసన తెలిపేందుకు ప్రభుత్వం అనుమతించకపోవటాన్ని ఐకాస నేతలు ఖండించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో ప్రభుత్వం ఉద్యమానికి మరింత మద్దతు పెరిగేలా చేసిందన్నారు.
*ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జనవరి మాసంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ఈనెల 19న ఆదివారం నగరంలో నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమంపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డా.వెంకటి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. నగరంలో మొత్తం 45,44,668
*మీడియాతో పాటు ఎంటర్టైన్మెంట్ రంగంలోని వారికి ఈ నెల 11, 12 తేదీల్లో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ స్కిల్ కార్పొరేషన్(ఎంఈఎస్సీ) దక్షిణ భారత సలహాదారు ప్రతిభా పులిజాల పేర్కొన్నారు.
*ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో జిల్లాలోని 1587 ప్రాంతాల్లో ఉన్న 3977 పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారి డీఎస్ లోకే్షకుమార్ తెలిపారు. 2020 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. క్యాంపెయిన్ డేల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు ముసాయిదా జాబితా, అభ్యంతరాలు, ఫిర్యాదుల నమూనా దరఖాస్తులతో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. బూత్ స్థాయి ఏజెంట్లు కూడా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా పేరు నమోదు చేసుకోవాలని కోరారు.
*ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించడంలో, ఫ్రెండ్లీ పోలీసింగ్లో తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.
* టిడిపి అభిమాని అవినాష్ అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను.అవినాష్ తో సహా టిడిపి సోషల్ మీడియా వాలంటీర్ల కు అండగా నేనుంటానుచట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తూ భావ ప్రకటనా స్వేచ్చని అణిచివేస్తూ పోలీసులు వ్యవహరించడం మానవ హక్కులు హరించడమే.
*పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరావు బుధవారం ఖమ్మం జిల్లా రఘునాథపాళెం మండలం కోటపాడులో పర్యటించారు. గ్రామస్థులు ఊరు శివారులోనే వారికి స్వాగతం పలికారు. అనంతరం అందరూ ర్యాలీగా గ్రామ సభ వద్దకు వెళ్లారు. అంతాబాగానే ఉన్నా మధ్యలో రోడ్డు పక్కనే ఉన్న చెత్తదిబ్బ మంత్రి కంట పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిగో ఇలా పట్టాకప్పి..ప్రజాప్రతినిధుల కళ్లుగప్పారు. చెత్త దిబ్బకు సమీపంలో గ్రామానికి తాగునీరు సరఫరా చేసే గేట్వాల్వ్ చుట్టూ బ్లీచింగ్ చల్లిన అధికారులు, అందులో కప్ప, చెత్త, పురుగులున్నా పట్టించుకోకుండా వదిలేశారు. పల్లె ప్రగతి పనులు తూతూమంత్రంగా సాగుతున్నాయనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం.
*పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరావు బుధవారం ఖమ్మం జిల్లా రఘునాథపాళెం మండలం కోటపాడులో పర్యటించారు. గ్రామస్థులు ఊరు శివారులోనే వారికి స్వాగతం పలికారు. అనంతరం అందరూ ర్యాలీగా గ్రామ సభ వద్దకు వెళ్లారు. అంతాబాగానే ఉన్నా మధ్యలో రోడ్డు పక్కనే ఉన్న చెత్తదిబ్బ మంత్రి కంట పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిగో ఇలా పట్టాకప్పి..ప్రజాప్రతినిధుల కళ్లుగప్పారు. చెత్త దిబ్బకు సమీపంలో గ్రామానికి తాగునీరు సరఫరా చేసే గేట్వాల్వ్ చుట్టూ బ్లీచింగ్ చల్లిన అధికారులు, అందులో కప్ప, చెత్త, పురుగులున్నా పట్టించుకోకుండా వదిలేశారు. పల్లె ప్రగతి పనులు తూతూమంత్రంగా సాగుతున్నాయనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం.
* ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూత వైద్యంలో భాగంగా రేణు అనే మహిళను ఆమె కుటుంబ సభ్యులే పాశవికంగా హింసించిన ఘటన బరేలీ జిల్లాలో జరిగింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఓ మహిళను గురువారం బరదార్‌ పోలీసులు అరెస్టు చేశారు.
*జీవశాస్త్రాల రంగానికి సంబంధించిన పరిశ్రమల్లో ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ సంచాలకుడు కేవై నాయక్ తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో ఐటీఐ ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. జర్మనీ సంస్థ జీఐజెడ్, హైదరాబాద్లోని అలీప్ సహకారంతో 260 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పిస్తామని నాయక్ చెప్పారు
*ఎంఈడీతోపాటు బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఎడ్), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(డీపీఎడ్) కోర్సులకు 2019-20 నుంచి 2021-22 విద్యా సంవత్సరం వరకు వార్షిక రుసుములను ఖరారు చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*వచ్చే నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించే బయోఏసియా-2020 అంతర్జాతీయ సదస్సులో 75 అంకురాలను ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటి వరకు 300 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల నమోదుకు ఈ నెల 12 వరకు గడువును నిర్దేశించింది. మొత్తం దరఖాస్తులలో ఉత్తమమైన 75 అంకురాలను ఎంపిక చేస్తామని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ బుధవారం చెప్పారు.
*వచ్చే నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించే బయోఏసియా-2020 అంతర్జాతీయ సదస్సులో 75 అంకురాలను ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటి వరకు 300 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల నమోదుకు ఈ నెల 12 వరకు గడువును నిర్దేశించింది. మొత్తం దరఖాస్తులలో ఉత్తమమైన 75 అంకురాలను ఎంపిక చేస్తామని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ బుధవారం చెప్పారు.
*కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నుంచి నీరు వస్తున్నందున పంటల దిగుబడులు భారీగా పెరగనున్నాయని వాటి నిల్వకు రాష్ట్రంలో గోదాముల సంఖ్య, నిల్వ సామర్థ్యం పెంచాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి సూచించారు. బుధవారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. జాతీయ రహదారుల పక్కనే కొత్త గోదాములు నిర్మించాలన్నారు. సంస్థ పనితీరు బాగుందని, లాభాలు ఆర్జిస్తున్నందుకు ఎండీ భాస్కరాచారి, ఉద్యోగులను ఆయన ప్రశంసించారు.
*కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)లో పనిచేస్తోన్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు త్వరలో మరోసారి అవకాశం కల్పిస్తామని విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వారితోపాటు ఎంఐఎస్ సమన్వయకర్తలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులకు ఈ అవకాశం ఇస్తామని చెప్పారు.
*జాతీయ రహదారులపై టోల్ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 15 నుంచి టోల్ప్లాజాల వద్ద ఒక్కో వైపు ఒక్కోటి మాత్రమే నగదు చెల్లింపు కేంద్రాలను నిర్వహించనుంది.
*కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం గురువారం ఉదయం జరగనుంది. బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. బోర్డు యాజమాన్యంతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ ఈఎన్సీలు సంబంధిత భేటీలో పాల్గొనేందుకు అప్పటికే సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ముఖ్యమైన పనుల కారణంగా సమావేశంలో పాల్గొనలేకపోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ వర్తమానం పంపించారు. గురువారం నాటి సమావేశానికి తాను సైతం హాజరవుతానని ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలియజేయడంతో సమావేశం వాయిదా పడింది.
*రాష్ట్రానికి వచ్చే నెల 10వ తేదీలోపు 1334 అద్దె బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇ.యాదగిరి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి డిపోను సందర్శించిన ఆయన ఈ మేరకు వెల్లడించారు. ప్రస్తుతం 11 రీజియన్ల పరిధిలో 97 డిపోల్లో 10,461 బస్సులు రోజూ 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయని, సగటున రూ.12 కోట్ల రాబడి వస్తోందని చెప్పారు. ఛార్జీల పెంపుతో రాబడి రూ.1.5 కోట్లు పెరిగిందని, మొత్తంగా సంస్థ రూ.400 కోట్ల నష్టాల్లో ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంస్థను లాభాల్లోకి తీసుకువచ్చే క్రమంలో 97 డిపోలను సీనియర్ అధికారులు దత్తత తీసుకున్నట్టు చెప్పారు..
*రాష్ట్రంలో పురపాలక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అవసరమైన సామగ్రిని సత్వరమే సమకూర్చుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల నివేదికలను ఎప్పటికప్పుడు పంపించాలని వారిని కోరారు