నిబంధనలకు విరుద్ధంగా మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహించారంటూ ‘అల..వైకుంఠపురములో..’ మ్యూజికల్ నైట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. టాలీవుడ్ నటుడు అల్లుఅర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజాహెగ్డే నటించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 6వ తేదీ సాయంత్రం యూసఫ్‌గూడలోని పోలీస్‌గ్రౌండ్స్‌లో సోమవారం సాయంత్రం ‘అల..వైకుంఠపురములో..’ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. చాలా వేడుకగా సాగిన ఈ మ్యూజికల్ కాన్సర్ట్ నిబంధనలకు విరుద్ధంగా సాగిందని తెలియజేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు ‘అల..వైకుంఠపురములో..’ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహకులపై కేసు నమోదు చేశారు
నిబంధనలకు విరుద్ధం
Related tags :