Editorials

లుకలుకలు…చీలికలు

Is the royal family experiencing troubles holding it together?

బ్రిటీష్ రాచ కుటుంబంలో చీలిక‌లు మొద‌ల‌య్యాయి. ప్రిన్స్ హ్యారీ, భార్య మేఘ‌న .. రాచ కుటుంబం నుంచి వేరుప‌డ‌నున్నారు. బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్‌కు ఓ లేఖ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. రాచ‌కుటుంబంలో సీనియ‌ర్ స‌భ్యులుగా ఉండాల‌న్న ఉద్దేశం త‌మ‌కులేద‌ని ప్రిన్స్ హ్యారీ, మేఘ‌న్‌లు పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. తాము ఒంట‌రిగా, ఆర్థికంగా బ‌లోపేతం కావాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యారీ భార్య మేఘ‌న్‌ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. గ‌త ఏడాది బ్రిటీష్ రాచ‌కుంటుంబీకుల మ‌ధ్య కొంత అగాధం ఏర్ప‌డింది, దీంతో కొన్ని నెల‌లుగా ఈ అంశాన్ని చ‌ర్చించామ‌ని, ఇక ఒంట‌రిగా బ్ర‌త‌కాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్రిన్స్ హ్యారీ తెలిపారు. ఉత్త‌ర అమెరికాలో తాము కొత్త జీవితాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు. రాచ‌కుటుంబంలో పెద్ద‌ల‌ను ఎవ‌ర్నీ సంప్ర‌దించకుండానే ప్రిన్స్ హ్యారీ దంప‌తులు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బ‌కింగ్‌హామ్ ప్యాలెస్ దంప‌తుల నిర్ణ‌యం ప‌ట్ల క్వీన్ ఎలిజ‌బెత్‌, ప్రిన్స్ చార్లెస్ నిరాశ‌కు గురైన‌ట్లు తెలుస్తోంది.