నగలు ధగధగలాడితేనే అందం. అందుకోసం నగల్లో పొదిగే రాళ్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాంటి వాటిలో చెప్పుకోదగినవి పోల్కి, జడావ్ నగలు! వజ్రాల మెరుపులు: అన్‌కట్ డైమండ్స్‌కు మెరుపు ఎక్కువ. కాబట్టే భారీ చోకర్లు, జడావ్ పోల్కీలు, నెక్లెస్ సెట్లు అన్‌కట్ డైమండ్స్‌తోనే ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. వీటిని ఎమరాల్డ్స్, రూబీస్, పెరల్స్‌తో జత చేసి ధరిస్తే వజ్రాల మెరుపు మరింత స్పష్టంగా పరావర్తనం చెందుతుంది. ఇలాంటి కాంబినేషన్ నగలను ధరించే దుస్తుల రంగును బట్టి మ్యాచ్ చేస్తూ ఉండాలి. నగల వరుసలు: లేయర్డ్ నెక్ పీస్‌లు లేటెస్ట్ ట్రెండ్. కాబట్టి ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, నెక్లెస్, మెడకు హత్తుకుని ఉండే చోకర్ అన్‌కట్ డైమండ్స్‌తో తయారైనవి ఎంచుకోవాలి. ఇలాంటి నగల అలంకరణ నిండుదనంతోపాటు, భారీ లుక్‌ను తెచ్చిపెడుతుంది. పండగలు, వేడుకలు, పూజల్లో ఈ తరహా నగల అలంకరణ ఆకర్షణీయంగా ఉంటుంది. జడావ్ టెక్నిక్: జడావ్ అనేది నగల రకం కాదు. నగల తయారీలో అనుసరించే నిర్దిష్టమైన ఓ పద్ధతి. మరీ ముఖ్యంగా కుందన్, పోల్కి నగల తయారీలో జడావ్ పద్ధతి ఉపయోగిస్తారు. ద్రవ రూపంలోని బంగారంలో రాళ్లు అద్ది, ఆ రాళ్ల చుట్టూ బంగారం అలుముకునేలా చేసి, ఈ నగలను తయారుచేస్తారు. అడుగున మీనాకారీ తరహా పద్ధతి అనుసరిస్తారు. కాబట్టే మిగతా నగల మాదిరి రాళ్లను పట్టి ఉంచే కొక్కేలు ఈ నగల్లో కనిపించవు. ఇదే జడావ్ పనితనం ప్రత్యేకత!
అన్‌కట్స్ అందం అదరహో
Related tags :