హిందూ ఆద్యాత్మిక గ్రంధాలు, పురాణాలు ‘18’ వ అంకెకు గొప్ప గుర్తింపు నిచ్చాయి.హిందువులు అత్యన పవిత్రంగా భావించే భావద్గీతలో, మహాభారతంలో , చతుర్వేదాలలో (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం) 18 అధ్యాయాలు ఉన్నాయి. మన హిందూ ఆద్యాత్మిక గ్రంధాలు అయిన పురాణాలు, ఉప పురాణాలు 18 ఉన్నాయి. మహాభారత యుద్ధం , రామరావణ యుద్ధం 18 రోజులు జరిగింది. కేరళ రాష్ట్రంలోని ప్రకృతి సోయగాల కొండల మధ్య పంబా నది తీరాన వెలసిన అయ్యప్ప స్వామి 18 ఆయుధాలతో చెడును నిరూలిస్తాడని పురాణ గాధ. ఆ 18 మెట్లను, 18 ఆయుధాలను సంకేతంగా అయ్యప్ప భక్తులు నమ్ముతారు.
**18 అంటే పరిపూర్ణత అనే అర్ధం. పరిపూర్ణతలను సాదించిన జ్ఞానికి సంకేతం 18. ఆ జ్ఞాన సాధనే అయ్యప్ప స్వామి మాల ధరించి 18 సంవత్సరాలు మండల దీక్ష అనగా 41 రోజుల నియమ నిష్టలతో పూజలు చేసి ఇరుముడి శబరిమలలో సమర్పించడం. అలా 18 సార్లు సమర్పించిన వారినే జ్ఞానికి సంకేతం అని, గురు స్వామి అని అంటారు. అలా అర్హతగల వారు శబరిమలలో 18 మెట్లు ఎక్కినా వారిని పరిపూర్ణత సాదించిన జ్ఞాని అని అంటారు.
**18 మెట్ల ప్రాముఖ్యత.
ఈమెట్లు పంచలోహాలు అనగా బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరాల ఒక ప్రత్యేక మిశ్రమం పూతతో కప్పబడి ఉంటాయి. 41 రోజులు (మండలం) అయ్యప్ప దీక్ష చేసేవారు మాత్రమె ‘పదునేట్టంబడి’ అంటే 18 మెట్లు ఎక్కటానికి అర్హులు. ఇది శబరి గిరీశుడు అయ్యప్ప నడిచిన దారి. అందుకే అత్యంత పవిత్రమైనది. ఎవరైనా పదునేట్టంబడిని 18 సారులు ఎక్కుతారో వాళ్ళు శబరిమలలో ఒక కొబ్బరి మొక్కని నాటుతారు. మొదటి ఎనిమిది మెట్లు కామ, క్రోధ, లోభ , మోహ, మధ, మాత్శార్య, డంబ, అహంకారాలనే అరిషడ్వర్గాలను సూచిస్తాయి. తర్వాత ఐదు మెట్లు నేత్రాలు, చెవులు, ముక్కు, జిహ్వ, స్పర్శ పంచేంద్రియాలను సూచిస్తాయి. ఆ తర్వాతి మూడు మెట్లు సత్యం, తామసం, రాజసం అనే మూడు గుణాలు సూచిస్తాయి.
**18 పర్వతాలు.
కేరళలోని అయ్యప్ప సనిధానం 18 గొప్ప పర్వతాల మధ్యన ఉంటుంది.
1. పొన్నంబలమేడు
2. గౌడేన్మలు
3. నాగమల
4. సుందరమల
5. చిట్టంబలమల
6. ఖల్గిమల
7. మతంగమల
8. మ్యాదుంమల
9. శ్రీపాదమల
10. దేవర్మల
11. నిలక్కలమల
12. తలప్పరమాల
13. నీలమల
14. కరిమల
15. పుదు సేర్వ్యమల
16.కలకేట్టిమల
17. ఇంచిప్పరమాల
18. శబరిమల
2.యాదాద్రిలో కాటేజీలకు హంగులు
యాదాద్రి పుణ్యక్షేత్రంలో యాత్రికుల బస కోసం ప్రత్యేక కాటేజీల నిర్మాణానికి సంబంధించి నమూనాల తయారీకి కసరత్తులు మొదలయ్యాయి. సంప్రదాయం, అధునాతన హంగులతో నిర్మాణాలు చేపట్టాలని తలచిన యాడా దిల్లీకి చెందిన ఆర్కాబ్ ఆర్కిటెక్ట్ ఇంజినీరింగ్ సంస్థకు ఇటీవల నమూనాల తయారీ బాధ్యతలను అప్పగించింది. క్షేత్రాభివృద్ధిలో భాగంగా 900 ఎకరాల్లో పెద్ద గుట్టపై ఆలయ నగరి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. 250 ఎకరాల్లో లేఅవుట్ పనులు పూర్తి చేసి కాటేజీల ఏర్పాట్లకు రహదారులు, పచ్చదనం, ఇతర వనరులను కల్పించారు. ఆలయనగరిలో నాలుగు రకాల కాటేజీల నిర్మాణానికి ఏర్పాటు ముమ్మరం చేసినట్లు యాడా నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే నిరంతర విద్యుత్తు సరఫరా కోసం పెద్దగుట్టపై ప్రత్యేక ఉపకేంద్రం ఏర్పాటుకు యాడా యత్నిస్తోంది.
**రామావతారంలో యాదాద్రీశుడు
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రబంధాల పఠనం, అలంకార సేవోత్సవాలను ఆలయ ఆచారంగా చేపట్టారు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి రోజు మొదలైన అధ్యయన వేడుకలు బుధవారం మూడో రోజుకు చేరాయి. ఉదయం శ్రీరామ అలంకరణ, సాయంత్రం తిరువేంకటపతిగా తీర్చిదిద్ది సేవోత్సవాలను చేపట్టారు.
3.త్వరలో అర్చకులకు వేతన బకాయిలు
రాష్ట్రంలో ధూపదీప నైవేద్యం పథకం కింద పనిచేస్తున్న అర్చకులకు అందాల్సిన 2 నెలల వేతన బకాయిలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ వెల్లడించారు. వేతన బకాయిలపై ఆర్థికమంత్రితో చర్చించి, ఉత్తర్వులు వెలువడేలా చూస్తామన్నారు. తెలంగాణ అర్చక సమాఖ్య రూపొందించిన నూతన దైనందిని ఆవిష్కరణ సందర్భంగా బుధవారం ఇక్కడి దేవాదాయ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
4. పంచాంగము 09.01.2020
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: హేమంత
మాసం: పౌష్య
పక్షం: శుక్ల
తిథి: చతుర్దశి రా.02:41 వరకు
తదుపరి పూర్ణిమ
వారం: గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం: మృగశిర ప.03:41 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: బ్రహ్మ, ఇంద్ర
కరణం: గార
వర్జ్యం: రా.12:03- 01:39
దుర్ముహూర్తం: 10:31 – 11:15
మరియు 02:59 – 03:43
రాహు కాలం: 01:46 – 03:10
గుళిక కాలం: 09:35 – 10:59
యమ గండం: 06:48 – 08:11
అభిజిత్ : 12:00 – 12:44
సూర్యోదయం: 06:48
సూర్యాస్తమయం: 05:57
వైది సూర్యోదయం: 06:52
వైదిక సూర్యాస్తమయం: 05:53
చంద్రోదయం: సా.04:38
చంద్రాస్తమయం: ఉ.పూ.05:10
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంర రాశి: మిథునం
దిశ శూల:శదక్షిణం
చంద్ర నివాసం: పశ్చిమం
విరూపాక్ష వ్రతము
కపర్ధీశ్వర పూజ
అంధకాసుర వధ
వనశంకరీ శాకావేదన
విద్యాధీశ తిరునక్షత్రము
5. రాశిఫలం – 09/01/2020
తిథి:
శుద్ధ చతుర్దదశి రా.2.05, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
మృగశిర మ.3.12
వర్జ్యం:
రా.11.35 నుండి 1.10 వరకు
దుర్ముహూర్తం:
ఉ. 10.00 నుండి 10.48 వరకు తిరిగి మ.2.48 నుండి 3.36 వరకు
రాహు కాలం:
మ.1.0 నుండి 3.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.)భయాందోళనలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది.స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసికాందోళన తప్పదు. చిన్న విషయాలపై ఎక్కువ శ్రమిస్తారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోనివారికి ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగివుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఋణప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుండును. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది.శుభకార్యాలమూలంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
6. తి.తి.దే. తిరుమల సమాచారం
ఈరోజు గురువారం 09-01-2020 ఉదయం 06 గంటల సమయానికి. తిరుమలలో భక్తుల రద్దీ ……
శ్రీ వారి దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లులో మాత్రమే వేచి ఉన్న భక్తులు…
సర్వదర్శనం కి సుమారు 4 – 5 గం. సమయం పట్టవచ్చు.
నిన్న జనవరి 08 న 70,534 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న తలనీలాలు సమర్పపించిన భక్తులు 13,615 మంది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹: 2.63 కోట్లు.
7. శ్రీరస్తు శుభమస్తు
తేది : 9, జనవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బృహస్పతివాసరే (గురువారం)
పక్షం శుక్లపక్షం
తిథి : చతుర్దశి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 44 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 35 ని॥ వరకు చతుర్దశి తిధి తదుపరి పూర్ణిమ తిధి)
నక్షత్రం : మృగశిర
(నిన్న సాయంత్రం 3 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 38 ని॥ వరకు మృగశిర నక్షత్రం తదుపరి ఆరుద్ర నక్షత్రం)
యోగము : (బ్రహ్మం ఈరోజు రాత్రి 7 గం ll 14 ని ll వరకు తదుపరి ఐంద్రం రేపు సాయంత్రం 4 గం ll 46 ని ll వరకు)
కరణం : (గరజి ఈరోజు సాయంత్రం 3 గం ll 15 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 15 ని ll )
వర్జ్యం : (ఈరోజు రాత్రి 11 గం॥ 45 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 18 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 6 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 30 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 3 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నము 2 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 30 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నము 1 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 3 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 51 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 6 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 4 ని॥ వరకు)
సూర్యరాశి : (ధనుస్సు 16.12.2019 మద్యాహ్నము 3 గం ll 35 ని ll నుంచి 15.1.2020 తెల్లవారుఝాము 2 గం ll 11 ని ll వరకు)
చంద్రరాశి : (వృషభం 6.1.2020 రాత్రి 8 గం ll 37 ని ll నుంచి 9.1.2020 తెల్లవారుఝాము 3 గం ll 50 ని ll వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 37 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 43 ని॥ లకు
8. శుభోదయం
మహానీయుని మాట
” దేవుడికి డాక్టర్ కి ఎప్పుడు కోపం తీసుకు రాకూడదు ఎందుకంటే దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరకు పంపిస్తాడు డాక్టర్ కి కోపం వస్తే దేవుడి దగ్గరకు పంపిస్తాడు. ”
నేటీ మంచి మాట
” మీ గాయాలను మీ లోపలే దాచుకోండి..
లోకులు కారం పిడికిట్లో దాచుకుని తిరుగుతున్నారు..
పుండు ఉంటేనే కారం చల్లడం పాత మాట..
పుండు చేసి కారం చల్లడం కొత్త బాట…
తస్మాత్ జాగ్రత్త..”
9. నేటి సామెత
పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
భోజనాల బంతిలో మొదట కూర్చోవాలనేది ఒక సూక్తి. ఎందుకంటే….. చివర్లో కూర్చుంటే వడ్డించే ఆహార పదార్థాలు తనదాక వస్తాయే లేక మధ్యలోనే అయిపోతాయేమోనని సందేహం. కాని వడ్డించే వాడు మనవాడైతె.. పదార్థాలు సరిపడక పోయినా…. మిగిల్చుకొని తనదాక వస్తాడస్ని ఈ సామెత అర్థం.
10. నేటి చిన్నారి గీతం
బలాబలాలు
చెన్నపట్నం, చెరుకుముక్క,
నీకోముక్క, నాకోముక్క;
భీముడుపట్నం, బిందెలజోడు,
నీకో బిందె, నాకో బిందె;
కాళీపట్నం, కాసులజోడు,
నీకోకాసు, నాకోకాసు.
11. నేటి ఆణిముత్యం
నిజకార్యసముద్దరణార్థమై మహిం
బనివడి యల్పమానవునిఁ, బ్రార్థనజేయుట తప్పు గాదుగా
యనఘతఁ గృష్ణజన్మమున, నా వసుదేవుఁ మీఁదుటెత్తుగాఁ
గనుఁగొని గాలిగానికడ, కాళ్ళకు మ్రొక్కఁడె నాఁడు భాస్కరా!
భావం:
ఎంత గొప్పవానికైనా, సమయం వచ్చినప్పుడు నీచుని వేడుకొనుట తప్పు కాదు. పూర్వము శ్రీకృష్ణమూర్తి జన్మించినప్పుడు అతని తండ్రి వసుదేవుడు గాడిదకాళ్లు పట్టుకోలేదా?
12. నేటి జాతీయం
గ్రహణం వీడింది
కష్టాలు తొలిగి పోయాయని అర్థం: ఉదా: ఈ దెబ్బతో వాని గ్రహణం వీడింది అని అటుంటారు.అటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
13. మన ఇతిహాసాలు
ఉత్తమజ్ఞానం
పులస్త్యుడు అనే వ్యక్తి ఉత్తమజ్ఞానం బోధించే గురువు కోసం నిరంతర అన్వేషణ చేయసాగాడు. ఎందరెందరో జ్ఞానులను కలుసుకున్నాడు. ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిం చాడు. అయినా అతని కోర్కె ఫలించలేదు. ఎందరో మహిమాన్వితులను కలుసుకుని తన వాంఛితాన్ని తెలియజేశాడు. కానీ అతనికి తృప్తికరమైన బోధన లభించలేదు.తిరిగి తిరిగి అలసిపోయిన పులస్త్యుడు ఒకనాడు ఒక గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటుతున్నాడు. పులస్త్యుడు అక్కడే కూర్చుని తదేకంగా చూడసాగాడు. మరు సటి రోజు భారీ వర్షం కురిసి విత్తనాలన్నీ కొట్టుకుపోయాయి.రైతు మళ్లీ వేరే విత్తనాలు తెచ్చి నాటాడు. ఆ తర్వాత వర్షమే పడలే దు. రైతు దూరంగా బావి నుంచి నీళ్లు తోడి పోశాడు. కానీ బావి కూడా ఎండిపోయింది. రైతు పట్టువిడవకుండా ఇంకా ఎంతో దూరంలో వున్న నది నుంచి నీళ్లు తెచ్చిపోయసాగాడు. క్రమంగా విత్తనాలు మొలకెత్తాయి. పంట దండిగా పండింది. రైతు హాయి గా పంట కోసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. పులస్త్యుడికి అసలు విషయం అర్థమైంది.ఉత్తమజ్ఞానం ఎక్కడో లేదు, మనచుట్టూ కనిపించే ప్రతి దానిలోనూ వుంటుంది. అదే రైతు తనకు ఇచ్చిన ఉపదేశంగా భావించాడు పులస్త్యుడు.ఒకసారి గరికపాటి నరసింహారావు గారికి ఒక అవధానంలో ఆశువు అంశం క్రింద ఒక పృచ్ఛకుడు ఇలా అడిగాడు – “అవధానిగారూ! కార్యేషు దాసీ కరణేషు మంత్రీ… అంటు ఆడది ఎలా ఉండాలో ఒక సంస్కృత శ్లోకంలో చెప్పారు గదా. దానికి పారడీగా, ఈ రోజుల్లో, భర్త ఎలా ఉండాలని ఆడవారు కోరుకుంటారో ఆశువుగా చెప్పండి”. అప్పుడు అవధానిగారు చెప్పిన ఈ అనేకభాషల శ్లోకం చూడండి:
శ్లో. కార్యేషు మిక్సీ, శయనేషు సెక్సీ
భరణేచ కూలీ, తరుణీషు శూలీ
రూపేచ హీరో, కోపేచ జీరో
షట్కర్మ కర్తా, కలికాల భర్తా.
(కలికాలంలో భర్తలు ఈ ఆరుపనులు చేయాలిట – పనులు త్వరత్వరగా చేయాలి మిక్సీ లాగా; పడకగదిలో సెక్సీగా ఉండాలి; సామాన్లు భరిస్తున్నప్పుడు కూలీలాగా ఉండాలి; ఆడవారి విషయాల్లో భార్యకు సగభాగమిచ్చిన శివుడు లాగా ఉండాలి; చూడటానికి సినిమా హీరోలాగా ఉండాలి; కాని జీరో కోపం ఉండాలి.)
image.gif
14. తిరుమల\|/సమాచారం
ఓం నమోవేంకటేశాయ!!
ఈరోజు గురువారం,
09.01.2020
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 14C°-28℃°
• నిన్న 70,534 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 01 కంపార్ట్మెంట్ లో
సర్వదర్శనం కోసం భక్తులు
వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
05 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 13,615 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 2.63 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
ప్రత్యేక దర్శనాలు:
• జనవరి 21, 28వ తేదీల్లో
వృద్ధులు, దివ్యాంగులకు
శ్రీవారి ప్రత్యేక దర్శనం,
• జనవరి 22, 29వ తేదీల్లో
5 ఏళ్లలోపు చంటిపిల్లల
తల్లిదండ్రులకు ప్రత్యేక
దర్శనం.
తిరుప్పావై
ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది.
15. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా అంబాజీపేట శివారు కొర్లపాటి వారి పాలెం లో వేంచేసిఉన్న శ్రీ భూ సమేత వెంకటేటేశ్వర స్వామి ఆలయంలో లక్ష తులసి పూజ వైభవంగా గురువారం ప్రారంభమయ్యింది.22 వ వార్షిక తులసి పూజను ఆలయ ప్రధానార్చకులు పాణంగిపల్లి నరసింహాచార్యులు పర్యవేక్షణలో పెద్దింటి వెంకటలక్ష్మీ నరసింహాచార్యులు. బ్రహ్మత్మo లో ఖండవిల్లి వెంకట రమణాచార్యులు ,సుసర్ల బుజ్జి ల ఆధ్వర్యంలో వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం లక్ష తులసి పూజ నిర్వహిస్తున్నారు. పూజకు అవసరమైన తులసి పత్రి ని స్థానిక .మహిళలు సిద్ధం చేస్తున్నారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పూజలో భాగంగా ఉదయం ప్రతేక పూజలు, సాయంత్రం జరిగే పూర్ణాహుతి తో కార్యక్రమం ముగుస్తుంది.అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహిస్తారు.
16. రామేశ్వరం ఆలయంలో ప్రధాన అర్చకుడి సస్పెన్షన్
రామేశ్వరం ఆలయ గర్భగుడిలోని మూలవిరాట్టు చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరలైన నేపథ్యంలో ఆ ఆలయ ప్రధాన అర్చకుడిపై సస్పెన్షన్ వేటు పడింది. రామేశ్వరంలోని ప్రసిద్ధ రామస్వామి ఆలయ గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టుకు సంబంధించిన ఫొటో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై హిందూ సంస్థలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతోపాటు ఆందోళనలూ చేపట్టాయి. శృంగేరి శంకరాచార్యులు, ఆయన దగ్గర దీక్ష పొందిన అర్చకులు మాత్రమే మూల విరాట్టుకు పూజలు చేసే అవకాశముందని, అందువల్ల వారిలో ఒకరు మూలవిరాట్టును ఫొటో తీసి ఉండొచ్చనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై ఆలయ జాయింట్ కమిషనరు కల్యాణి విచారణ చేపట్టారు. ప్రధాన అర్చకులు విజయకుమార్ ఆ ఫొటో తీసినట్టు తేలడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. 20 ఏళ్లకుపైగా ఆయన ఈ ఆలయంలో విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. తనపై ఆరోపణలను విజయకుమార్ ఖండించారు. తన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నా వాడటం తెలియదన్నారు. నడుంలో ఉంచుకుని గర్భగుడిలోకి వెళ్తానని, పొరపాటున సెల్‌ఫోన్ కెమెరా ఆన్ అయి ఉంటుందని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆ సెల్‌ఫోన్‌ను మార్చానని, అప్పుడు అందులోని ఫొటోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసి ఉంటారని వివరణ ఇచ్చారు.
17. ఓ నమో వేంకటేశాయ:
08.01.2020న తిరుమల సాయంత్రం వరకు
శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య : 70,534
09.1.2020 తేదీ నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులతో నిండిన కంపార్టుమెంట్లు : 1
సర్వదర్శనం కోసం పట్టు సమయం : 4 లేదా 5 గంటలు తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య : 13615
హుండీ ఆదాయం రూ. 2.63 కోట్లు మరిన్ని వివరాలకు http://www.edukondalu.com
18. ఓం నమోవేంకటేశాయ తి.తి.దే. తిరుమల సమాచారం
ఈరోజు గురువారం 09-01-2020 ఉదయం 06 గంటల సమయానికి. తిరుమలలో భక్తుల రద్దీ ……
శ్రీ వారి దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లులో మాత్రమే వేచి ఉన్న భక్తులు…
సర్వదర్శనం కి సుమారు 4 – 5 గం. సమయం పట్టవచ్చు.
నిన్న జనవరి 08 న 70,534 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న తలనీలాలు సమర్పపించిన భక్తులు 13,615 మంది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹: 2.63 కోట్లు.
19. జనవరి 10న తిరుపతి శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో జనవరి 10వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది.ఆలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు.అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.
20.జనవరి 11న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జనవరి 11వ తేదీ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.
శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు.
21.జనవరి 16న తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు.గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9.00 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్‌స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు.ఆనంతరం మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు.
**ఆర్జితసేవలు రద్దు :
ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాలసేవ, అర్చన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.