* ముఖ్యమంత్రిగా ప్రజా విధుల్లో ఉన్నందున ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ, ఈడీ కోర్టును కోరారు. సీఎం అభ్యర్థనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరం తెలిపింది. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులకు మినహాయింపు ఇవ్వొద్దని ఈడీ వాదించింది. దీనిపై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పును ఈనెల 24కు వాయిదా వేసింది.
* కోర్టు బోనులో నిలబడ్డ తొలి ముఖ్యమంత్రి జగనేనని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఇలాంటి నేరప్రవృత్తి ఉన్న వ్యక్తి సీఎం కావడం వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతో పాటు వైకాపా నేతలు, అధికారులు జైళ్లకు వెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్రం ఆందోళనలతో మండిపోతుంటే వీడియో గేమ్‌లతో సీఎం, కోడి పందేలతో మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. క్రిస్మస్, సంక్రాంతి కానుకలు ఎగ్గొట్టడం ద్వారా కోటి మందికిపైగా పేదల కడుపు కొడుతున్నారని ఆక్షేపించారు. అమరావతి ప్రాంత మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్‌ను ఖండించారు. ప్రభుత్వం మానవ హక్కులను యథేచ్ఛగా కాలరాస్తోందన్న ఆయన…ఎస్సీల ఆత్మహత్యలపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
* తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నగల మాయం నిజమేనని కమిటీ మరోమారు తేల్చింది. మూడు వెండి కిరీటాలు, ఉంగరాలు, నెక్లెస్‌ల కోసం జరిపిన విచారణలో నిజమని తెలిసింది
* నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడిలో విషాదం చోటుచేసుకుంది. సురేష్ (11),హేమంత్(13) అనే ఇద్దరు చిన్నారులు( అన్నదమ్ములు )ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తల్లి తండ్రులు బైనా వెంకట సుబ్బారెడ్డి ,సునీత వ్యవసాయ కూలీలుగా ఉన్నారు.
* హీరో మహేష్ బాబు ఇంటి ముందు ఏపీ రాజధాని కోసం నిరాహారదీక్ష. హైదరాబాద్ ఫిలిమ్ నగర్ లో దీక్షకు దిగిన జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని డిమాండ్. ఏపీ కి చెందిన సినిమా హీరోలు నటులు స్పందించాలని డిమాండ్.
* తుళ్లూరు నందు చోటు చేసుకున్న పరిణామాలతో భాగంగా విధులలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసిన ఘటన కి సంబంధించి తెనాలి శ్రావణ్ కుమార్ పై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
* డిఎస్పీ జి.రామాంజనేయులును సస్పెండ్ చేస్తూ డిజిపి గౌతం సవాంగ్. గతంలో గుంటూరు అర్బన్ నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీగా పనిచేసిన జి.రామాంజనేయులు. గుంటూరు అర్బన్ నార్త్ సబ్ డివిజన్ పరిధి యర్రబాలెం గ్రామానికి చెందిన చిమట్ట కోటేశ్వరావు ఒక మహిళను హత్య చేసిన కేసులో నిండితులతో చేతులు కలిపి కేసును తారుమారు చేసారని ఆరోపణలో సస్పెండ్ చేసినట్లు సమాచారం.
* పోలీసుల ఆంక్షలు దాటుకుని దుర్గగుడి చేరుకున్న తుళ్లూరు మహిళలు. దుర్గమ్మకు ముడుపులు చెల్లించుకోవటానికి వచ్చిన మహిళలు. రాజధాని గ్రామాల్లో అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు.
* ఏపీ రాజధాని ప్రాంత రైతులు గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టుకోవడాన్ని ఆపటం, మహిళలపై పోలీసుల హేయమైన దాడిని ఖండిస్తున్నట్లు భాజపా తెలిపింది. రాజధాని ప్రాంతంలో దేవతలకు పూజల చేయకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఏపీ భాజపా అధికార ప్రతినిధి సాయికృష్ణ కోట స్పందించారు. హిందూ సంప్రదాయాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్న దాడిగా ఈ ఘటన కనిపిస్తోందన్నారు.
* ఏపీ రాజధాని ప్రాంతం తుళ్లూరులో మహిళలపై పోలీసులు దాడి చేశారని వస్తున్న ఆరోపణలపై ఎస్పీ విజయరావు స్పందించారు. 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్” అమల్లో ఉందని ముందుగానే ప్రకటించాం. అయినా చట్టవిరుద్ధంగా ఒకేసారి గుంపుగా రావడం వల్లే వారిని అడ్డుకున్నాం. పోలీసులు ఎవరిపైనా దాడి చేయలేదు.
* గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అమరావతి పరిరక్షణ సమితి ఆందోళన. ఆందోళన అడ్డుకున్న పోలీసులు. పోలీసులకు అమరావతి పరిరక్షణ సమితి నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట.
* సిబీఐ కోర్టులో ముగిసిన జగన్ విచారణ దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన విచారణ. తదుపరి విచారణ ఈ నెల 17 కి వాయిదా వేసిన సిబిఐ కోర్టు.
* తమిళనాడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జరిగినట్లు గా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియా ద్వారా కొంతమంది వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను ట్రోల్ చేస్తూ ప్రశాంత వాతావరణంగా ఉన్న రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు పాల్పడుతున్నారు. ఇటువంటి అసత్య మైన వార్తలను ప్రసారం చేసిన, ఇతరులకు షేర్ చేసిన, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఇలాంటి వార్తలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండగలరు.
* అనంతపురం రూరల్ రిజిష్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. సబ్ రిజిస్టర్ సత్య నారాయణ వద్ద 2లక్షల15 వేలు స్వాధీనం.