నివేదా థామస్, నివేదా పేతురాజ్.. పేర్లు మాత్రమే కాదు నటనపరంగా కూడా ఇద్దరూ ఒక్కటే. 2016లో విడుదలైన ‘జెంటిల్‌మన్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమ్యారు నటి నివేదా థామస్. ఈ సినిమాలో ఆమె పలికించిన హావభావాలకు అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే నివేదా వచ్చిన తర్వాత సంవత్సరమే అంటే 2017లో విడుదలైన ‘మెంటల్ మదిలో’ సినిమాతో నివేదా పేతురాజ్ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అక్కడి నుంచి వీరిద్దరూ కథా బలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తమ నటనతో ప్రేక్షకుల్ని మంత్ర మగ్దుల్ని చేస్తున్నారు. ఇక 2019లో విడుదలైన ‘బ్రోచేవారెవరురా’ చిత్రంలో నివేదా థామస్, నివేదా పేతురాజ్ కలిసి నటించారు. గతేడాది ఒకే చిత్రంలో దర్శనమిచ్చిన వీరిద్దరూ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచారు. విశేషం ఏమిటంటే..? ఈ ఇద్దరు కథానాయికలు సంక్రాంతికి వచ్చే సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. అంతేకాదు సినీ కెరీర్ పరంగా ఈ ఇద్దరికీ ఇదే తొలి సంక్రాంతి. ఒకరు సూపర్‌స్టార్ చిత్రంలో కనిపిస్తే.. మరొకరు స్టైలిష్ స్టార్ చిత్రంలో సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దర్బార్’ సినిమాలో రజనీ కుమార్తెగా నివేదా థామస్ కనిపించారు. సినిమాకే చాలా కీలకంగా ఉండే పాత్రలో కనిపించి నివేదా థామస్ తన నటనతో మెప్పించారు. మరోవైపు నివేదా పేతురాజ్ నటించిన ‘అల..వైకుంఠపురములో..’ చిత్రం జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నివేదా పేతురాజు పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట. మరి ఆమె నటనతో ఎలా మెప్పించిందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..!
నివేదల పోరు
Related tags :