మలేసియా మాస్టర్స్ సూపర్ బ్యాడ్మింటన్ 500 టోర్నీ నుంచి భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో 16-21, 16-21 తేడాతో ఓటమిపాలైంది. మొదటి గేమ్‌లో సింధు తొలుత ఆధిక్యం సాధించినా తర్వాత దాన్ని కాపాడుకోలేకపోయింది. 15-15తో స్కోరు సమంగా ఉన్న దశలో తైజు వరుస పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. అనంతరం రెండో గేమ్‌లో కూడా తైజునే ఆధిపత్యం చెలాయించింది. ఒక దశలో 11-20తో వెనుకంజలో ఉన్న సింధుకి ఘోర పరాభవం తప్పదని భావించారంతా. కానీ తెలుగు తేజం ఆఖర్లో చెలరేగి 16-20తో నిలిచింది. అయితే గేమ్ విజయానికి ప్రత్యర్థికి ఒక్క పాయింట్ దూరంలోనే ఉండటంతో సింధుకి ఓటమి తప్పలేదు. దీంతో మరో గేమ్ మిగిలుండగానే తైజు సెమీస్‌కు చేరింది. ఇప్పటివరకు తైజుతో సింధు 17 మ్యాచుల్లో తలపడగా 5 మ్యాచులే నెగ్గింది. ఒలింపిక్ పతక విజేత కరోలినా మారిన్‌తో జరిగిన మరో క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్ ఘోర పరాజయం చవిచూసింది. 8-21, 7-21 తేడాతో వరుస గేముల్లో చిత్తుగా ఓడింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో మలేసియా మాస్టర్స్‌లో భారత్ కథ ముగిసింది.
మలేషియా టోర్నీ నుండి నిష్క్రమించిన సింధు
Related tags :