ఏపీ రాజధాని అమరావతిని తరలించవద్దని ఇప్పటికే పలువురు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడిప్పుడే రాజధాని రైతులకు సినిమా ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే హీరో నారా రోహిత్ సంఘీభావం ప్రకటించారు. తాజాగా సింగర్ స్మిత ట్విట్టర్ ద్వారా రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. రాజధాని తరలింపు చాలా బాధాకరమని ఆమె అన్నారు. రైతుల వేదన చూస్తుంటే గుండె పగిలిపోతోందన్నారు. రైతుల బాధ తట్టుకోలేనిదని ఆమె అన్నారు. రైతులపై సానుభూతి చూపించకుండా మాకేంటిలే అనుకునే వాళ్లను చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధను పంచుకుంటూ వారికి న్యాయం చేయాలని దేవుడ్ని పార్థిస్తున్నానన్నారు. అమరావతి రైతులకు తాను ఉన్నానని స్మిత పేర్కొన్నారు.
అమరావతి రైతులకు గాయని స్మిత బాసట

Related tags :