నిర్భయ… సమత… దిశ… పేరు పెట్టినవి, బయటకు తెలిసినవి కొన్ని సంఘటనలు మాత్రమే. కానీ నేటి మహిళకు నిత్యజీవితం పోరాటంగానే ఉంది. ఈ నేపధ్యంలో మహిళల వ్యక్తిగత భద్రత కోసం ఒక కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. మహిళల రక్షణ కోసం శ్యామ్ చౌరాసియా అనే ఔత్సాహిక శాస్త్రవేత్త ‘లిప్‌స్టిక్ గన్’ను తయారుచేశారు. ‘‘ఎవరైనా మహిళ ప్రమాదకర స్థితిలో ఉన్నపుడు దీనికి అమర్చిన బటన్‌ను నొక్కాలి. అప్పుడు పేలుడు వంటి పెద్ద శబ్దం వెలువడటమే కాకుండా అత్యవసర ఫోన్ నంబర్ 112కు కూడా సమాచారం పంపుతుంది.’’ అని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసికి చెందిన శ్యామ్ వివరించారు. సాధారణ లిప్‌స్టిక్ మాదిరిగానే ఉండే దీనిని వెంట ఉంచుకోవటం చాలా సులభం. ఎవరికీ అనుమానం కూడా రాదు. దీనిని రీఛార్జి చేసుకుని మరల వాడుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా మన మొబైల్‌కు అనుసంధానించవచ్చు. ఇన్ని ప్రత్యేకతలున్న దీని ఖరీదు సుమారు రూ.600 మాత్రమే అని శ్యామ్ తెలిపారు. దీనిని ఉపయోగిస్తున్న వారు కూడా లిప్‌స్టిక్ గన్ పనితీరు శభాష్ అనే అంటున్నారు.
ఈ లిప్‌స్టిక్ గన్ ఖరీదు ₹600 మాత్రమే
Related tags :