Movies

దేశభక్తి చిత్రాల్లో…

Aishwarya Sarja Following Father's Footsteps

హీరో హీరోయిన్ల పిల్లలు కూడా వారి బాటలోనే నడవడం ఇండస్ట్రీలో ఎప్పుడూ జరిగేదే. అయితే ఇటీవలి కాలంలో ఆడపిల్లలు కూడా పేరెంట్స్‌‌ని అనుసరించి యాక్టర్స్‌‌ అవ్వడం పెరిగింది. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా తన తండ్రిలాగే నటనపై ఇష్టాన్ని పెంచుకుంది. తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ అంతగా కలిసి రాలేదు. ఇప్పటి వరకు తమిళంలో రెండు, కన్నడలో ఒక సినిమా మాత్రమే చేసింది. అయితే ఇప్పుడు తెలుగు సీమలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. తెలుగు ప్రేక్షకులకు అర్జున్‌‌ బాగా చేరువనే సంగతి తెలిసిందే. అందుకే తన కూతుర్ని కూడా టాలీవుడ్‌‌లో ప్రవేశపెడితే ఆమె కెరీర్ మలుపు తిరిగే చాన్స్ ఉందని అర్జున్ భావిస్తున్నట్లు తెలిసింది. అంతే కాదు.. ఆమె తొలి తెలుగు చిత్రాన్ని స్వయంగా ఆయనే డైరెక్ట్ చేయనున్నాడట. ఆల్రెడీ ఓ ప్రొడ్యూసర్‌‌‌‌తో ప్రాజెక్ట్ సెట్ అయ్యిందని కూడా సమాచారం. మరి ఇతర భాషల్లో దక్కని గుర్తింపు ఐశ్వర్యకి టాలీవుడ్‌‌లో దక్కుతుందా? నటిగా కోరుకున్న స్థాయికి చేరుకుంటుందా? చూడాలి మరి.