అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ రామోన్ నగర మేయర్ పదవికి పోటీ చేయనున్నట్టు తెలుగు మహిళ అపర్ణ మాదిరెడ్డి ప్రకటించారు. నవంబరులో ఈ ఎన్నికలు జరగనుండగా, పోటీ చేస్తానంటూ మొట్టమొదట ప్రకటించిన నాయకురాలు ఈమే కావడం గమనార్హం. ‘అర్వసాఫ్ట్’ అనే సాఫ్ట్వేర్ సలహా సంస్థ యజమానురాలైన ఆమె… భర్త, కుమార్తెతో కలిసి ఆ నగరంలో ఉంటున్నారు. ప్రస్తుతం కాంట్రా కోస్టా కంట్రీ జనాభా లెక్కల కమిటీలో డిస్ట్రిక్ట్-2 ప్రతినిధిగా ఉంటున్నారు. నగరంలోని బహిరంగ స్థలాల సలహా సంఘం అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. భూగర్భ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె భూ వినియోగ ప్రణాళికల రూపకల్పనలో నిపుణురాలు కావడం విశేషం.
అమెరికాలో…మేయర్ బరిలో తెలుగు మహిళ
Related tags :