Devotional

తీర్థం తలకు రాసుకోకూడదు

Do not rub your hands to your hair after teertham

1.తీర్ధం తలపై ఎందుకు రాసుకోకూడదు అంటే? – ఆద్యాత్మిక వార్తలు 11/01
దేవాలయాల్లో తీర్ధన్న్ తీసుకున్న తరువాత ఆచేతిని తలపై రాసుకోకూడదు అంటున్నారు పండితులు. చేతులు హోదించి దేవదేవుని నమస్కరించి ప్రార్ధన చేయవచ్చు. కాని తీర్ధాన్ని తీసుకున్న తరువాత చేతులను తలపై రాయకూడదని శాస్త్రాలు చెప్పుతున్నయత. సాధారణంగా గుడిలో తీర్ధాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులో పంచదార తేనే వంటివి జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్ధం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. తీర్ధ మ్తీసుకున్న తరువాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది ఆచేయినే తలకు రాసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వదని వారు చెపుతున్నారు అందుచేత తీర్ధం తీసుకున్న చేతిని నీతితో కడుక్కోవాలని పండితులు సెలవిస్తున్నారు తీర్ధం తీసుకున్న తరువాత ఆ చేతిని నెత్తికి రాసుకోవడం చేయకూడదు జేబు రుమాలుతో తుడుచుకోవాలి లేదా కండువాతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు కనీ గంగా జలంతో అభిషేకం చేసిన తీర్ధాన్ని మాత్రమే తలపై రాసుకోవచ్చని పండితులు అంటున్నారు.
2. శుభమస్తు
తేది : 11, జనవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు: హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పాడ్యమి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 49 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 38 ని॥ వరకు)
నక్షత్రం : పునర్వసు
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 46 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 27 ని॥ వరకు)
యోగము : వైదృతి
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 36 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 8 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 23 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 11 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 40 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 17 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 1 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 58 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 6 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 11 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 9 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 48 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 58 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : మిథునము
3. చరిత్రలో ఈ రోజు/జనవరి 11*రాహుల్ ద్రావిడ్
1922 : మధుమేహ రోగులకు ఇన్సులిన్‌ వాడకం ప్రారంభించిన రోజు.
1928 : ప్రకృతి ధర్మవాద సమయంలో ఒక ఆంగ్ల నవలారచయిత మరియు కవి థామస్ హార్డీ మరణం (జ.1840).
1944 : భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ జననం.
1966 : భారత దేశ రెండవ ప్రధాని, ప్రధానిగా శ్వేతవిప్లవం, హరితవిప్లవం, పాకిస్తాన్ యుద్ధం వంటి విజయాలు సాధించిన లాల్ బహదూర్ శాస్త్రి మరణం (జ.1904).
1973 : భారత క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్ జననం.
1991 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త . ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ డేవిడ్ అండర్సన్ మరణం (జ.1905).
2008 : న్యూజీలాండుకు చెందిన పర్వతారోహకుడు మరియు అన్వేషకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం (జ.1919).
4. శుదయం
ఓ నమో వేంకటేశాయ:
10.01.2020న తిరుమల సాయంత్రం వరకు
శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య : 64,160
11.1.2020 తేదీ నాటికి
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో
భక్తులతో నిండిన కంపార్టుమెంట్లు : 1
సర్వదర్శనం కోసం పట్టు సమయం : 4 నుంచి 6 గంటలు
తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య : 18,951
హుండీ ఆదాయం రూ. 3 కోట్లు
మరిన్ని వివరాలకు http://www.edukondalu.com/
5. తిరుమల\|/సమాచారం* ****
_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈరోజు శనివారం,
*11.01.2020*
ఉదయం 6 గంటల
సమయానికి,
_తిరుమల: *15C°-23℃°*_
• నిన్న *64,160* మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో *01* కంపార్ట్మెంట్ లో
సర్వదర్శనం కోసం భక్తులు
వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*06* గంటలు
పట్టవచ్చును,
• నిన్న *18,951* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 3* కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
_*/ / గమనిక / /*_
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
_*ప్రత్యేక దర్శనాలు:*_
• జనవరి 21, 28వ తేదీల్లో
వృద్ధులు, దివ్యాంగులకు
శ్రీవారి ప్రత్యేక దర్శనం,
• జనవరి 22, 29వ తేదీల్లో
5 ఏళ్లలోపు చంటిపిల్లల
తల్లిదండ్రులకు ప్రత్యే
దర్శనం.
*_తిరుప్పావై_*
_ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది._
*ttd Toll free #18004254141*
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం
కోసం క్రింద లింకు ద్వారా చేరండి https://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
6. రాశిఫలం – 11/01/2020
తిథి:
శుద్ధ పూర్ణిమ రా.1.14, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
ఆర్ద్ర మ.3.11
వర్జ్యం:
రా. 2.57 నుండి 4.31వరకు
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 9.12 వరకు, తిరిగి మ.12.24నుండి 01.12వరకు
రాహు కాలం:
ఉ.10.00 నుండి 12.00 వరకు తీవిశేషాలు: గురుమూఢమ సమాప్తం, భార్గవరాకావ్రతం
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) విందులు, వినోదాలకు దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. మానసికాందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలెదురవుతాయ. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆలస్యంగా తెలుసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణవిముక్తి లభిస్తుంది. మానసికానందం పొందుతారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబ విషయాలపై అనాసక్తితో వుంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్ర్తిలతో జాగ్రత్తగా నుండుట మంచిది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వున్నాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర వ్యయ ప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలెక్కువగా వుంటాయి. స్ర్తిల మూలకంగా ధనలాభముంటుంది.
7. శుభోదయం
ఓ నమో వేంకటేశాయ:
10.01.2020న తిరుమల సాయంత్రం వరకు
శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య : 64,160
11.1.2020 తేదీ నాటికి
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో
భక్తులతో నిండిన కంపార్టుమెంట్లు : 1
సర్వదర్శనం కోసం పట్టు సమయం : 4 నుంచి 6 గంటలు
తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య : 18,951
హుండీ ఆదాయం రూ. 3 కోట్లు
మరిన్ని వివరాలకు http://www.edukondalu.com/
8.నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో మ‌న‌గుడి – గోపూజ‌
సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జ‌న‌వ‌రి 11, 12వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 23వ విడత మనగుడి – గోపూజ కార్యక్రమం జరుగనుంది.
జ‌న‌వ‌రి 11న రెండు రాష్ట్రాల్లో జిల్లాకు 10 చొప్పున ఆల‌యాల్లో గోపూజ నిర్వ‌హిస్తారు. అదేవిధంగా, జ‌న‌వ‌రి 12న అన్ని జిల్లా కేంద్రాల్లో గోపూజ చేప‌డ‌తారు. అదేవిధంగా, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్ర కేంద్రాల్లోనూ గోపూజ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.
9. అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొప్పుల
కేరళ రాష్ట్రంలోని శబరిమల పుణ్యక్షేత్రంలో కొలువైన హరిహరసుతుడు, అయ్యప్ప స్వామి వారిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరుట్ల శాసన సభ్యులు విద్యాసాగర్ రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, గ్రంథాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్, వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ ఏలేటి క్రిష్ణా రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అయ్యప్పస్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో కేరళ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
10. శుభోదయం
మహానీయుని మాట
” ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్ధం కాదు.
ఒకసారి చేజారిన తరువాత అర్థం అయినా ఏమీ చేయలేం అవి కాలమయినా, స్నేహితులయినా, బంధువులైనా, చివరకు వస్తువులయినా…”
నేటీ మంచి మాట
” మనకున్న సంపదతో మనం సంతృప్తిగా జీవించిన క్షణాలే నిజంగా మనం జీవించిన క్షణాలు.”