Movies

ముద్దుల కోసం హద్దులు దాటిన అభిమాని

Sarah Ali Khan's Selfie Nightmare

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్కి ఓ అభిమాని అనుకోని షాకిచ్చాడు. జిమ్ నుండి బయటకు వచ్చిన సారా అలీఖాన్ని అక్కడున్న ఫొటోగ్రాఫర్స్ స్టిల్స్ అడిగారు.. సున్నితంగా తిరస్కరించిన సారా.. అక్కడున్న అభిమానులకు సెల్ఫీలు ఇవ్వడానికి సిద్ధమైంది. సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో ఓ అభిమాని ఆమె చేయిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సారా, చేయిని వెనక్కి తీసేసుకుంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డు అతన్ని కొట్టడానికి ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. నువ్వు ఓ బాడీగార్డుని పెట్టుకోవచ్చుగా అని కొందరు నెటిజన్లు దీనిపై కామెంట్ చేస్తే.. మరికొందరు, అభిమాను హద్దు మీరాడంటూ కామెంట్ చేశారు. సైఫ్ ఆలీఖాన్ కుమార్తెగా కేదార్నాథ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సారా ఇప్పుడు కూలీ నెం.1, లవ్ ఆజ్ కల్ సీక్వెల్స్లో నటిస్తుంది.