NRI-NRT

అమెరికావ్యాప్తంగా అమరావతి కోసం నిరసనలు

Save AP. Save Amaravathi. Protests In USA For Amaravathi.-అమెరికావ్యాప్తంగా అమరావతి కోసం నిరసనలు

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు అమెరికాను తాకాయి. అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న ఎన్నారైలు ‘సేవ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ పేరుతో నిరసనలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి, అధికార వికేంద్రీకరణ వద్దంటూ నినదించారు. ఇప్పటికే వాషింగ్టన్‌ డీసీ, డెలావేర్, పెన్సిల్వేనియా, చికాగో, ఆస్టిన్, న్యూ జెర్సీ, డెమోయిన్స్ లో సమావేశాలు నిర్వహించారు. ఇవాళ, రేపు కాలిఫోర్నియా, హ్యూస్టన్, ఒమాహ, కాన్సాస్ సిటీ, పోర్ట్లాండ్, అట్లాంటా, సెయింట్ లూయిస్, డిట్రాయిట్, బోస్టన్, బాల్టిమోర్, చార్లట్, ర్యాలీ, మిన్నియాపోలిస్, కొలంబస్, డల్లాస్ నగరాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రవాసాంధ్రులు తెలిపారు.