‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్. హాస్యనటి శ్రీలక్ష్మికి స్వయానా మేనకోడలైన ఐశ్వర్య ఇంతకుముందు ‘స్వామి2’, ‘నవాబ్, ‘అందమైన మనసులో’… వంటి డబ్బింగ్ చిత్రాల్లో మెరిసింది. నేరుగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది మాత్రం ఈ ఏడాది వచ్చిన ‘కౌసల్యా కృష్ణమూర్తి’తోనే. అసలు ఏమాత్రం తెలియని క్రికెట్‌ను ఆర్నెల్లలో నేర్చేసుకుని షూటింగ్‌లో డూప్‌లేకుండా సిక్సర్లు కొట్టి అందరిచేతా చప్పట్లు కొట్టించుకుంది. తాజాగా విడుదలైన ‘మిస్‌మ్యాచ్’లో తన మార్కు నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నటిస్తోంది.
అత్త పేరు నిలబెడుతోంది
Related tags :