Fashion

అనార్కలి గౌన్‌లో అందం ఇనుమడింపు

Anarkali Gowns New Designs 2020

కొత్త ఏడాదిలో కొత్తగా కనిపించాలనుకుంటే అందమైన అనార్కలి గౌన్స్‌లో అదరగొట్టాలి!

ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన ఈ గౌన్లు ఎలాంటి వేడుకలకైనా సూటవుతాయి. మరీ ముఖ్యంగా ఈవినింగ్‌ పార్టీ గౌన్‌గా కూడా వీటిని ధరించవచ్చు. రొటీన్‌కు భిన్నంగా మీరూ వీటిని ఎంచుకోండి!

శాటిన్‌, కాటన్‌, నెట్‌… ఎలాంటి మెటీరియల్‌తో తయారైనవైనా అనార్కలి గౌన్స్‌ అందంగానే ఉంటాయి. సెల్ఫ్‌ డిజైన్‌ లేదా ఎంబ్రాయిడరీ, ప్యాచ్‌వర్క్‌…
వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు. దేనికది భిన్నం, వినూత్నం!

అనార్కలిగౌన్స్‌కు హైహీల్స్‌ చక్కగా సూటవుతాయి. ఇందుకోసం పెన్సిల్‌ హీల్స్‌, లేదా పాయింటెడ్‌ హీల్స్‌ ఎంచుకోవాలి. బూట్‌ టైప్‌ హీల్స్‌ కూడా బాగుంటాయి.

గౌన్‌ కాబట్టి దీనికి అదనపు హంగులు ఉండకూడదనే రూలేం లేదు. ఇష్టమైతే డోరీలు కూడా కుట్టించుకోవచ్చు, లేదా రెడీమేడ్‌ డోరీలను తగిలించుకోవచ్చు!