Movies

సైన్యం-న్యాయం

Army And Justice Departments Are Her Background

క్రికెట్‌ నేపథ్యంలో ఈ ఏడాది ప్రథమార్ధంలో వచ్చిన ‘జెర్సీ’ ప్రేక్షకుల హృదయాల్ని బరువెక్కించింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నటి శ్రద్ధా శ్రీనాథ్‌. 80ల నాటి గృహిణిగా, ఉద్యోగినిగా సారా పాత్రలో మెప్పించి ఆది సరసన ‘జోడీ’లో మెరిసింది. ఆర్మీ నేపథ్యమున్న ఈ కన్నడ కస్తూరీ ఇంటర్‌, డిగ్రీ సికింద్రాబాద్‌లోనే పూర్తి చేసింది. తరవాత బెంగళూరులో న్యాయవిద్య అభ్యసించి ఓ సంస్థలో న్యాయసలహాదారుగానూ పనిచేసింది. కొంతకాలానికి కార్పొరేట్‌ జీవితాన్ని పక్కన పెట్టి ఆసక్తికొద్దీ కన్నడ, మలయాళ సినిమాల్లోకి అడుగుపెట్టి ఈ ఏడాది టాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది.