NRI-NRT

మూడు రాజధానులకు వ్యతిరేకంగా బే-ఏరియా ఎన్నారై తెదేపా నిరసన

Bay Area NRI TDP Protests Against YSRCP's 3 Capital Decision

ఏపీ రాజధానిని అమరావతి నుండి మూడు చోట్లకు విస్తరించడం పట్ల బే-ఏరియా ఎన్నారై తెదేపా నిరసన వ్యక్తం చేసింది. కోమటి జయరాం ఆధ్వర్యంలో మిల్పిటాస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రవాసులు జగన్ ప్రభుత్వ వైఖరిని నిరసించారు. మూడు రాజధానులు విఫల ప్రయోగమన్నారు. పోలీసు వ్యవస్థ సహకారంతో మహిళలు, రైతులను వేధిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయరామ్‌ కోమటి, వెంకట్‌ కోగంటి, ప్రసాద్‌ మంగిన, వీరు ఉప్పల, జే ప్రసాద్‌ వేజేళ్ళ, భక్త బల్లా, రజనీ కాకర్ల, రామ్‌ తోట, శ్రీకాంత్‌ దొడ్డపనేని, యశ్వంత్‌ కుదరవల్లి తదితరులు పాల్గొన్నారు.