ఫిబ్రవరి 21 నుంచి ఆస్ట్రేలియాలో జరిగే మహిళా టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఆదివారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుందని ట్విటర్లో వెల్లడించింది. కాగా ఈ జట్టులో బెంగాల్ రూకీకి చెందిన రిచా ఘోష్ అనే బ్యాట్స్‌వుమన్‌ను మాత్రమే కొత్తగా ఎంపిక చేశారు. మరోవైపు ఇటీవల సంచలన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 15 ఏళ్ల షెఫాలీ వర్మ తొలిసారి ప్రపంచకప్ ఆడబోతుండటం విశేషం. ప్రపంచకప్ కన్నా ముందు జనవరి 31 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో తలపడే ట్రై సిరీస్‌కు సైతం సెలెక్టర్లు 16 మంది సభ్యులను ఎంపిక చేశారు. ఇందులో నుజత్ పర్వీన్‌ను అదనపు క్రికెటర్‌గా తీసుకున్నారు.
ప్రపంచకప్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంథాన, షెఫాలీవర్మ, జెమిమా రోడ్రిగ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, షిఖా పాండే, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి.
ట్రై సిరీస్ జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంథాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, రీచా ఘోష్, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, షిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, నుజత్ పర్వీన్.