NRI-NRT

అమరావతి కోసం కదిలిన హ్యూస్టన్

అమరావతి కోసం కదిలిన హ్యూస్టన్-Houston Telugus Support Amaravathi Farmers And Single Capital System

రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర హ్యూస్టన్ నగర ప్రవాసాంధ్రులు తమ సంఘీభావం ప్రకటించారు. ఏపీలోని 13 జల్లాలకు చెందిన ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులతో ఐకాస ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సమావేశంలో పలువురు ప్రవాసాంధ్రులు రాజధాని రైతులకు మద్దతుగా ప్రసంగించారు. మీ రాజధాని ఏదని అడిగితే ఒకే పేరు చెబుతారు. కానీ ఏపీలో 3 పేర్లు చెప్పాల్సిన పరిస్థితి వైకాపా ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. ఇప్పటివరకు ₹9వేల కోట్లు ఖర్చు చేశారని, మరో ₹3వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అయిపోయే రాజధానిని మూడుముక్కలు చేయడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. అనుమతులు పొందేందుకు మూడు రాజధానుల మధ్య తిరగడం పారిశ్రామికవేత్తలకు తలనొప్పిగా మారుతుందని అన్నారు. రాజధాని వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.