ఏపీ రాజధాని అంశంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుప్పకూలే పరిస్థితిలో ఉందన్నారు. ఏపీ రాజధాని పరిణామాలపై తెలంగాణ వ్యక్తిగా సంతోషంగా.. భారతీయ పౌరుడిగా బాధగా ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితుల ప్రభావంతో హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పెరిగిందని చెప్పారు. ఏపీ కుప్పకూలే పరిస్థితి వల్ల తెలంగాణకే లాభం చేకూరుతుందన్నారు. నిన్నటి వరకు సోదరులుగా ఉన్న రాష్ట్రంలో ముసలం పుట్టడం బాధగా ఉందని.. తెలంగాణలో ఓ స్థిరాస్తి వ్యాపారికి మేలు చేసేందుకే గందరగోళం సృష్టించారన్నారు.
ఏపీని చూస్తోంటే బాధ…సంతోషం
Related tags :