2020 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికాలోని కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం శాక్రమెంటోలో స్థానిక తెలుగు సంఘం శాక్రమెంటో తెలుగు సంఘం(టాగ్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన UAN మూర్తి స్మారక 2వ రచనల పోటీ విజేతల వివరాలు దిగువ చూడవచ్చు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేషియా తదితర దేశాల నుంచి రచయితలు ఈ పోటీలో పాల్గొన్నారు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే.
*** ప్రధాన విభాగం:
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
1.ప్రథమ బహుమతి: ప్రతిబింబం – ఉమాదేవి అద్దేపల్లి (శాన్ హోసే , కాలిఫోర్నియా, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.ద్వితీయ బహుమతి : దత్తపుత్రుడు – శ్రీశేష కల్యాణి గుండమరాజు (రాక్లిన్, కాలిఫోర్నియా, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.తృతీయ బహుమతి : ప్రదక్షిణం – తాటిపర్తి రజనీకాంత్ రెడ్డి (దక్షిణాఫ్రికా) ($28, ప్రశంసా పత్రం)
*** ప్రోత్సాహక బహుమతులు గెలిచుకున్నవారు:
1.మూడు తరాల తోట – మల్లికేశ్వర రావు కొంచాడ (ఆస్ట్రేలియా)
2.మేలిమి వజ్రం – వాత్సల్య రావు (సింగపూర్)
3.నీలదంతం – ఆర్. శర్మ దంతుర్తి (కెంటకీ, అమెరికా)
4.పితృప్రేమ – రాధిక నోరి (ఫ్లోరిడా, అమెరికా)
5.గోపాలరావు లాంటి స్నేహితుడు మీకు దొరుకుతాడా? – రవి కుమార్ పిశుపాటి (లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, అమెరికా)
*** ఉత్తమ కవిత విభాగం విజేతలు:
1.ప్రథమ బహుమతి : మనిషీ ఓ మనిషీ – గౌతమ్ లింగ (దక్షిణాఫ్రికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.ద్వితీయ బహుమతి : జటాయువు (పద్య ఖండము) – శేషం శ్రీవాత్సవ (లాస్ ఏంజల్స్, కాలిఫొర్నీయా, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.తృతీయ బహుమతి : తెలుగేలరా – ఆర్. శర్మ దంతుర్తి (కెంటకీ, అమెరికా) : ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
*** ప్రోత్సాహక బహుమతులు గెలిచుకున్నవారు:
1.అదృశ్యం – విశాలాక్షి దామరాజు (కెనడా)
2.పెన్సిల్ “గీత” – రవికాంత్ పొన్నాపల్లి (టెక్షాస్, అమెరికా)
3.కరభూషణం – మానస చమర్తి (మసాచుసెట్స్, అమెరికా)
4.హాలాహలము – శ్రీధర రెడ్డి బిల్లా (క్యూపర్టినో, కాలిఫొర్నీయా, అమెరికా)
5.దేశానికి వెన్నెముక ఈ రైతేనా – మల్లిఖార్జున రావు కొమర్నేని (ఓక్లహోమా, అమెరికా)
అనువాద కథ రచన పోటీ – 13 ఏండ్లలోపు యువ రచయితల విభాగంలో ప్రోత్సాహక బహుమతి గెలిచుకున్న చిన్నారి: “పరోపకారార్ధం – సంహిత పొన్నపల్లి (టెక్షాస్, అమెరికా)”
విజేతలకు టాగ్స్ అభినందనలు తెలిపింది. ఈ పోటీల నిర్వహణకు సహాయ సహకారలు అందించిన గ్రీట్ వే సంస్థకు టాగ్స్ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలియజేస్తుంది. టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం సంవత్సరం పొడవునా రచనలు స్వీకరించడం జరుగుతుంది. భారత్ తో సహా విదేశాలలో నివసిస్తున్న రచయితలు ఎవరైనా వారి వారి కథ, కథానిక, కవిత, వ్యాసాలు మరియూ పుస్తక పరిచయం వంటి రచనలు వారి ఈ-మెయిలు telugusac@yahoo.comకు పంపవచ్చును.