DailyDose

20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు-తాజావార్తలు

AP Assembly Sessions To Start From 20th-Telugu breaking news

* త్వరలో ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. రాజధాని సహా కీలక బిల్లులపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశముంది.అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున మూడు రాజధానులు రావొచ్చంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని తరలించవద్దంటూ 27 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో అందరి దృష్టీ వాటిపై పడనుంది.
*ఎస్వీబీసీ చైర్మన్‌గా స్వప్న?
శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా జర్నలిస్ట్ స్వప్నను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఎస్వీబీసీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. గత రెండు రోజులుగా ఎస్వీబీసీలో చోటుచేసుకున్న పరిణామాలతో.. ఆ సంస్థ చైర్మన్ పృథ్వీ రాజీనామా చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశం మేరకు రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌గా ఉన్న స్వప్న.. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్వప్న ఓ తెలుగు న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు.
*ఈనెల 17న నింగిలోకి జీశాట్‌-30 ఉప‌గ్ర‌హం
ఇస్రో రూపొందించిన జీశాట్‌-30 ఉప‌గ్ర‌హాన్ని ఈనెల 17వ తేదీన ప్‌జయోగించ‌నున్నారు. ఏరియేన్‌-5 రాకెట్ ద్వారా దీన్ని నింగిలోకి పంపుతారు. ఫ్రెంచ్ గ‌యానాలోని కౌరు అంత‌రిక్ష కేంద్రం నుంచి ఈ ప్ర‌యోగం జ‌ర‌గ‌నున్న‌ది. జీశాట్‌-30ని క‌మ్యూనికేష‌న్ శాటిలైట్‌గా త‌యారు చేశారు. జియో స్టేష‌న‌రీ ఆర్బిట్ నుంచి సీ, కేయూ బ్యాండ్ల‌లో క‌మ్యూనికేష‌న్ సేవ‌ల‌ను అందిస్తుంది. జీశాట్ బ‌రువు సుమారు 3357కిలోలు. ఐ-3కే ప్లాట్‌ఫామ్‌లో దీన్ని త‌యారు చేశారు. ఇన్‌శాట్‌-4ఏకు ప్ర‌త్యామ్నాయంగా జీశాట్‌-30 ప‌నిచేయ‌నున్న‌ది. భార‌త్‌తో పాటు అనుబంధ దేశాల‌కు ఈ శాటిలైట్ ద్వారా కేయూ బ్యాండ్‌లో సిగ్న‌ల్ అందిస్తారు. గ‌ల్ఫ్ దేశాల‌కు సీ బ్యాండ్ ద్వారా క‌వ‌రేజ్ ఇవ్వ‌నున్నారు. ఆసియాలో కొన్ని దేశాల‌తో పాటు ఆస్ట్రేలియాకు కూడా సీ బ్యాండ్ ద్వారా సేవ‌లు అందిస్తారు. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈనెల 17వ తేదీన 2.35 నిమిషాల‌కు ఈ శాటిలైట్‌ను నింగిలోకి పంపిస్తారు.
* రాజధాని గ్రామాల్లో పరిస్థితులపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. 144 సెక్షన్‌, మహిళలపై లాఠీచార్జ్‌ ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారించిన హైకోర్టు.. గ్రామాల్లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘గ్రామాల్లో పోలీసుల మార్చ్‌ఫాస్ట్‌ జరగడమేంటి? కర్ఫ్యూ వాతావరణం ఎందుకు?’ అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.
*ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం మించడంపై ఓ వ్యక్తి సుప్రీం కోర్టు తలుపుతట్టాడు. రిజర్వేషన్లు 50శాతం మించకూడదనే నిబంధనను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆమోదయోగ్యం కాదని అంటూ కర్నూలుకు చెందిన బిరు ప్రతాపరెడ్డి అనే వ్యక్తి అభిప్రాయపడ్డాడు. రిజర్వేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాడు. దీనిపై విచారణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
*నిడమర్రులో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్క డ్రైనేజీ నిర్మాణం పేరుతో 10మంది అనుచరులతో కలిసి… ప్రొక్లయినర్‌తో రేకుల షెడ్డును కాంట్రాక్టర్ కూల్చేశాడు. అడ్డొచ్చిన కుటుంబసభ్యులపై కాంట్రాక్టర్‌ మూకుమ్మడి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
* ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సంతోషంగా పండుగ నిర్వహించుకోవాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని కేసీఆర్‌ అభిలషించారు.
*దేశంలో కొందరు మైనార్టీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప.. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి పేర్కొన్నారు.
*హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం కూడా వాహనాల రద్దీ కొనసాగింది. సంక్రాంతి పర్వదినానికి రాజధాని నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికుల వాహనాలతో జాతీయ రహదారి హోరెత్తింది.
*ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిని నిర్మించిన రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ మనుమడు డేవిడ్ పోస్నెట్ సందర్శించారు. తన కుమారుడు ఎడ్వర్డ్, కోడలు గ్యాబ్రిల్లా ఫెరారీతో కలిసి ఆదివారం ప్రార్థనాలయాన్ని తిలకించారు.
*పోలీసులు ఆంక్షలు విధిస్తున్నా.. కవాతులతో భయపెట్టాలని చూస్తున్నా రాజధాని రైతులు, మహిళలు పట్టుదలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఆదివారం 26వ రోజు కూడా ఆందోళనలు కొనసాగించారు. పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా పలు గ్రామాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. రాజధాని రైతులకు మద్దతుగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి, సుంకర పద్మశ్రీ, సీపీఐ నాయకులు, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలకు చెందిన పలువురు ఆయా గ్రామాలకు వచ్చి సంఘీభావం ప్రకటించారు.
*సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ల కారణంగా దేశ పౌరుల పౌరసత్వం ప్రశ్నార్థకంగా మారుతుందని సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య కళానిలయంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల పౌరులంతా తమ పౌరసత్వాన్ని ఆధారాలతో నిరూపించుకోవాల్సి వస్తుందన్నారు.
*తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీపతి సతీష్, కె.ప్రసన్నలు హైదరాబాద్లోని ఆదివారం ఆయన నివాసంలో కలిశారు. ఈనెల 18న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో అమరజ్యోతి ర్యాలీ నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా హాజరుకావాలని చంద్రబాబును ఆహ్వానించారు.
*దేశంలో ఒక వైపు ఆర్థిక మాంద్యం నెలకొందని చర్చ జరుగుతుంటే, మరో వైపు ప్రజాస్వామ్య మాంద్యం ఏర్పడిందని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి, జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు
*సిద్దిపేట ప్రాంతంలో ఇండోరమ సింథటిక్ కంపెనీ ఆధ్వర్యంలో పట్టుదారం తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు.
*హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టరుగా ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేని వ్యక్తిని నియమించాలని కోరుతూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. అది సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ పరిధికి సంబంధించిన అంశమైనందున ఈ లేఖను ఆ శాఖకు పంపుతున్నట్లు పేర్కొన్నారు.
*రాష్ట్రంలో విద్యుత్ వాహనాల(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ సంస్థ(ఆర్ఈఎల్)తో శనివారం తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్రెడ్కో) పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. టీఎస్రెడ్కో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు సంస్థల అధికారులు సంతకాలు చేశారు. తెలంగాణలో ఈ స్టేషన్ల ఏర్పాటు బాధ్యతను ఎన్టీపీసీ, ఆర్ఈఎల్లకు కేంద్రం అప్పగించింది. వీటి ఏర్పాటుకు రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా టీఎస్రెడ్కో వ్యవహరిస్తుందని సంస్థ అధికారులు తెలిపారు.
*టీఎన్జీవోస్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సెంట్రల్ ఫోరం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా కె.ఎస్.శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడిగా సయ్యద్ ఉమర్అలీ, ఉపాధ్యక్షులుగా ఎం.రాజశేఖర్, నీర్ల మహేశ్, కె.కీర్తన, కార్యదర్శిగా ఎం.శ్రీధర్, సంయుక్త కార్యదర్శులుగా సయ్యద్ ఖుతుబుద్దీన్, పి.మహేంద్రనాథ్, కె.స్వతంత్ర కుమార్, కోశాధికారిగా ఎ.విశ్వేశ్వర్ రావు ఎన్నికయ్యారు. కార్యాలయ కార్యదర్శిగా కె.శరత్కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా పి.సాయిబాబా, ప్రచార కార్యదర్శిగా పి.రాము ఎన్నికయ్యారు. మరో నలుగురిని ఈసీ సభ్యులుగా ఎన్నుకున్నారు.
*పశ్చిమాసియా కల్లోలిత ప్రాంతం యెమెన్లో జరిగిన బాంబు దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువతికి హైదరాబాద్కు చెందిన సన్షైన్ ఆసుపత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. మంచానికే పరిమితమైన ఆమెను అరుదైన శస్త్రచికిత్స ద్వారా మళ్లీ నడిచేలా చేశారు. వివరాలను శనివారం గచ్చిబౌలి సన్షైన్ ఆసుపత్రిలో విలేకరుల సమావేశంలో ఆసుపత్రి ఎండీ డాక్టర్ ఎ.వి.గురువారెడ్డి, డాక్టర్ అశోక్ రాజు, డాక్టర్ వాసుదేవ జువ్వాడి వెల్లడించారు.