అమరావతి రైతుల కష్టాలకు ఉత్తర అమెరికా గట్టిగా స్పందిస్తోంది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో నిరసన కార్యక్రమాలతో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవాసులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కెనడా దేశంలోని టొరంటో, కిచ్నర్ నగరాలకు చెందిన ప్రవాసులు అమరావతి రైతులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. కెనడాలో అమరావతికి మద్దతుగా తొలిసారిగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిరసనలో ముప్పాల శశిధర్, గోగినేని రామ్‌తేజ, ధనేకుల ఫణి, ధనేకుల సిద్ధు, మైనేని చైతన్య, అడ్డాల కృష్ణ, గోపినీడి రాం, బీ.గిరిధర్, కంటు మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
కెనడాకు పాకిన అమరావతి సెగ
Related tags :