NRI-NRT

అమరావతి రైతన్నల కోసం కదిలిన షార్లెట్ ప్రవాసులు

Charlotte Telugu NRIs March For Amaravathi Farmers In USA-అమరావతి రైతన్నల కోసం కదిలిన షార్లెట్ ప్రవాసులు

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా అమెరికాలోని ఉత్తర కారోలీనా రాష్ట్ర షార్లెట్ ప్రవాసులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు, పిల్లలు హాజరయ్యారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని జగన్ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమరావతి రైతులతో మాట్లాడి అక్కడ రైతుల అవస్థలను అడిగి తెలుసుకుని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.