Kids

గంబూషియా చేపల కథ ఇది

Gambusia fish story in telugu and how it makes mosquitoes run away

హాయ్‌ ఫ్రెండ్స్‌… ఏంటి అలా చూస్తున్నారు..చాలా చిన్నగాఉన్నా అనా..నా రూపం ఇంతే..నేను మిగతా చేపల్లా పెద్దగా పెరగను కానీ.. పిట్ట కొంచెంకూత ఘనం అన్నట్లు నేను చిన్నగా ఉన్నా…నాకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి..వాటిగురించి మీకు చెబుదామనే ఇదిగో ఇలా.. వచ్చా…ఇంతకీ నా పేరు మీకు చెప్పనే లేదు కదూ..మీకున్నట్లే నాకూ రెండు పేర్లున్నాయి. నా ముద్దు పేరు మస్కిటో ఫిష్‌, అసలు పేరు గంబూషియా!!
* మా స్వస్థలం అమెరికా సంయుక్తరాష్ట్రాలు. మాకో గొప్పతనం ఉంది..అన్ని చేపలూ దోమల లార్వాలు తింటాయి… కానీ మేం మిగతావాటి కన్నా.. ప్రత్యేకం.అందుకే మమ్మల్ని మాత్రమే మష్కిటో ఫిష్‌ అంటారు.
* మా శరీరం వెండి వర్ణంలో మెరిసిపోతూ… ఉంటుంది.
* మేం చాలా చిన్న చేపలం. మాలో ఆడచేపలు ఏడు సెంటీమీటర్లు, మగవి కేవలం 4 సెంటీమీటర్ల పొడవుమాత్రమే ఉంటాయి.* చిన్న పిల్లలైతే కేవలం 8నుంచి 9మిల్లీమీటర్ల వరకు మాత్రమే ఉంటాయి. ఇవిఓ దశ వరకు రోజుకు 0.2 మిల్లీమీటర్లు పెరుగుతాయి.
* మేం చిన్నగా ఉంటామని తక్కువగా అంచనా వేయకండి. మాకు దూకుడు చాలాఎక్కువ.
* చిన్న చిన్న నీటిగుంటల్లోనూ ఎంచక్కా పెరిగేస్తాం. దోమలలార్వాలు ఎక్కువగా పెరిగేది చిన్న చిన్న కుంటల్లోనే కదా.. ఇక్కడ మిగతా చేపలుపెరగలేవు. కానీ మేం మాత్రం దోమల లార్వాలు తింటూ హాయిగా బతికేస్తాం.
* మాలో ఒక్కో చేప రోజులో 50 నుంచి 100 దోమల లార్వాలను హాంఁఫట్‌ చేసేస్తుంది.
* అందుకే మమ్మల్ని దోమల నివారణ కోసమే ప్రత్యేకంగా పెంచుతుంటారు.దోమలు పెరిగే ఆస్కారమున్న నీటి మడుగుల్లో,మురుగు కుంటల్లో మమ్మల్ని విడిచిపెడుతుంటారు.
* మేము ఎక్కువగా లోతు లేని చిన్న చిన్న మడుగుల్లో జీవిస్తుంటాం.పెద్ద చేపల నుంచి రక్షించుకోవడానికి లోతు తక్కువున్న చోట మా జీవనాన్ని సాగిస్తాం.
* ఎన్నో ప్రతికూల పరిస్థితులున్నా.. మేం హాయిగా బతికేస్తాం.సముద్రజలాల్లో ఉన్న లవణీయత కన్నా రెట్టింపు ఉన్న నీటిలోనూ దర్జాగా ఈదేస్తాం.!* నీటిలో ఆక్సిజన్‌ శాతం కాస్త తగ్గగానే మిగతా చేపలు చాలావరకుకళ్లు తేలేస్తాయి కానీ.. మేము మాత్రం తక్కువ ఆక్సిజన్‌ స్థాయి ఉండే మురుగుకుంటల్లోనూ ఎంచక్కా పెరిగేస్తాం.
* చిన్న చిన్న నీటి కుంటలు సూర్యరశ్మి వల్ల తొందరగావేడెక్కుతాయి. ఈ పరిస్థితుల్లో ఇతర చేపలు బతకలేవు. మేం మాత్రం ఈ వాతావరణంలోనూజీవిస్తాం. !
* మేం ప్రపంచంలో మనుషులున్న ప్రతి చోటకూ విస్తరించాం. దోమలలార్వాల నాశనం కోసం… ముఖ్యంగా మలేరియా వ్యాప్తి నివారణ కోసం మాపై మీరుఆధారపడుతుండటమే దీనికి కారణం
.* మాకన్నా పెద్ద చేపలు,పక్షులు,కప్పలు,తాబేళ్లు మాకు ప్రధాన శత్రువులు.
* ఇంతచేస్తే మేం బతికేది కేవలం 18నెలలు మాత్రమే. కానీ పరిస్థితులుఅనుకూలిస్తే ప్రత్యేక సందర్భాల్లో మహా అయితే మూడు సంవత్సరాల వరకు జీవిస్తాం.