DailyDose

నలుగురు ముద్దాయిలకు జీవిత ఖైదు-నేరవార్తలు

Tamilnadu Court Sentences Four Rapists To Life-Telugu Crime News Roundup

* 27 ఏళ్ల మ‌హిళ‌ను అత్యాచారం చేసిన కేసులో న‌లుగురు నిందితుల‌కు త‌మిళ‌నాడు కోర్టు జీవిత‌కాల శిక్ష‌ను విధించింది. ఎస్‌.పురుషోత్తం, ఎస్‌.అన్‌బ‌ర‌స‌న్‌, ఎస్‌.దినేశ్‌, వ‌సంత్‌లకు కోర్టు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. 2018 డిసెంబ‌ర్ ఒక‌ట‌వ తేదీన కుంభ‌కోణంలో ఆ రేప్ జ‌రిగింది. తాంజావూర్‌లోని మ‌హిళా కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఉద్యోగంలో భాగంగా బ్యాంకు శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ఓ మ‌హిళ‌ను న‌లుగురు రేప్ చేశారు. రైల్వే స్టేష‌న్‌లో దిగిన మ‌హిళ‌ను ఇద్ద‌రు తొలుత ఆటోరిక్షాలో తీసుకువెళ్లారు. ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద‌రు వ‌చ్చి ఆమెను రేప్ చేశారు
* తిరునెల్వేలి సమీపాన ప్రియుడు మృతిచెందిన ప్రాంతంలోనే ఓ యువతి ఐదేళ్ల బిడ్డను అనాథగా విడిచి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. దీన్ని గమనించిన స్థానికులు నెల్‌లై పోలీసులకు సమాచారం అందించారు
* షోపియాన్ జిల్లాలోని ఉర్పోరా ఏరియాలో టెర్రరిస్టు లు దాక్కున్న అండర్ గ్రౌండ్ బంకర్ ఇది.. లోకల్ పోలీసులు, సెక్యూరి టీ సిబ్బంది తనిఖీలలో ఈ స్థావరం బయటపడింది. దాదాపు 8 ఫీట్ల లోతులో ఉన్న ఈ హైడవుట్ లో ఆహార పదార్థాలతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రి బయటపడ్డాయి. టెర్రరిస్టులతో పాటు ఓ పోలీస్ ఉన్నతాధికారి సెక్యూ టీ బలగాలకు చిక్కిన విషయం తెలియడంతో టెర్రరిస్టులు ఇక్కడి నుంచి మకాం ఎత్తేసి ఉంటారని ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు
* వెస్ట్ బెంగాల్ లోని అసన్ సోల్ లో బీజేపీ ఆఫీస్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటల్లో పార్టీ ఆఫీస్ మొత్తం తగలబడిపోయింది. అసన్ సోల్ జిల్లాలో ఉన్న సాలన్ పూర్ లో ఉన్న బీజేపీ ఆఫీసుకు ఆదివారం రాత్రి దండగులు నిప్పంటించారు.
*సినీ నటుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కృష్ణుడు నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి అల్లూరి సీతారామరాజు సోమవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా భీమవరం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సీతారామరాజు ఈరోజు మరణించారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు, పార్టీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు వినాయకుడు సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ అలరించిన కృష్ణుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
*ఒంటిపై నల్లటి దుస్తులు.. చేతిలో అధునాతన ఆయుధాలు.. పరిసరాలపై డేగ చూపులు.. అత్యంత ప్రముఖుల చుట్టూ దర్శనమిచ్చే ‘బ్లాక్‌ క్యాట్‌’ కమాండోలు ఇక జనబాహుళ్యంలో కనిపించరు. వీఐపీల రక్షణ బాధ్యతల నుంచి వీరిని పూర్తిగా ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా తెదేపా అధినేత చంద్రబాబు సహా 13 మందికి ‘బ్లాక్‌ క్యాట్‌’ భద్రత ఉండదు. ఈ బాధ్యతలను త్వరలో పారామిలటరీ దళాలకు అప్పగిస్తారు. ఇప్పటికే ఈ దళాలు దాదాపు 130 మంది ప్రముఖులకు రక్షణ కల్పిస్తున్నాయి.
*ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా గంగలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు హత్య చేశారు. మృతదేహం నోటికి గుడ్డలు కట్టి ఉంది. మావోయిస్టుల హత్యగా అనుమానిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
*నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది
*హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని టాట్ పబ్పై పోలీసులు దాడులు నిర్వహించారు. అశ్లీల నృత్యాలు జరగుతున్నాయనే సమాచారంతో ఆదివారం రాత్రి పశ్చిమ మండల టాస్క్ఫోర్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులతో పాటు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో దాడులు చేశారు.
*జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో భారత భద్రతా దళాలు జరిపిన కాల్పల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్లోని గల్షన్పురా ప్రాంతంలో భద్రతాధికారులు ఆదివారం కట్టడిముట్టడి నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భ్రదతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. ఈక్రమంలో బలగాలు చేసిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే హతమైనట్లు అధికారులు తెలిపారు. అయితే, వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
*కోల్కతా నుంచి ముంబయికి బయల్దేరిన ఓ విమానం గంట సేపటి తర్వాత అక్కడికే వచ్చి ఆదివారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువతి తన శరీరానికి బాంబులు ఉన్నాయని సిబ్బందికి తెలియజేయడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని వెనక్కి మళ్లించారు.
*విహార యాత్రకు వెళ్లిన జడ్చర్ల జిల్లా వాసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా నదిలో గల్లంతైన ఘటన ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..మహబూబ్నగర్ ఐసీడీఎస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వెంకటేశ్, రాజశేఖర్(30), వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని ఐసీˆడీఎస్ కార్యాలయాల్లో పనిచేస్తున్న రాఘవేంద్రాచారి, మధుకర్ స్నేహితులు. వీరంతా శనివారం ఉదయం కారులో విహార యాత్రకు బయల్దేరారు.
*రాజధాని అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. రాజధాని తరలిపోతోందని మనస్తాపానికి గురై రాయపూడి గ్రామానికి చెందిన మహిళా రైతు షేక్ జైనాబీ(61) ఆదివారం రాత్రి చనిపోయారు. రాజధాని నిర్మాణానికి ఆమె 2.20 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారు. ఆమె మృతి పట్ల రాజధాని పరిరక్షణ ఐకాస ప్రతినిధులు సానుభూతి తెలిపారు.
*హన్మకొండలో కలకలం సృష్టించిన యువతి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలను వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ శనివారం మీడియాకు వెల్లడించారు.
*కంటిపాపలా కాపాడాల్సిన తండ్రే కర్కశుడిగా మారాడు. మద్యం మత్తు తలకెక్కి భార్యపై ఉన్న కోపాన్ని బిడ్డపై చూపాడు. ఏ పాపమెరుగని పసిబుగ్గల చిన్నారిని గొంతునులిమి చంపేశాడు. ఈ అమానవీయ ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
*చరవాణిలో ఏర్పడిన పరిచయంతో మాట కలిపాడు. ప్రేమ పేరిట వేధించాడు. కాదని చెప్పినా వినకుండా బెదిరింపులకు దిగాడు. బెంగళూరు నుంచి నగరానికి వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
* దేశ రాజధాని దిల్లీలో శనివారం మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ దిల్లీలోని మాయాపురి ఫేజ్ 2లోని షూ తయారీ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది.
*పాల్గర్ జిల్లా బాయిసర్లోని ఓ రసాయన పరిశ్రమలో శనివారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు.
*గుజరాత్ లోని ఒక గ్యాస్ కంపెనీలో పేలుడు సంభవించటంతో పలువురు మృతి చెందారు. వడోదర జిల్లా, పడ్రా తాలూకా, గవాసద్ గ్రామ సమీపంలోని పారిశ్రామిక, ఔషధ సంబంధ గ్యాస్ను తయారుచేసే కర్మాగారంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
*చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియా వెళ్లాల్సిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు అతిగా మద్యం సేవించి వీరంగం సృష్టించారు. దీంతో విమానం సుమారు గంట ఆలస్యంగా బయలుదేరింది. ఎయిర్పోర్టు అధికారుల సమాచారం మేరకు.. మలేషియాకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఇద్దరు వ్యక్తులు అధికంగా మద్యం అందజేయాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇద్దరూ అప్పటికే మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. వారిని వెంటనే విమానం నుంచి దించేసి పోలీసులకు అప్పగించారు.
*చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో శనివారం అటవీశాఖ అధికారులు పులి కళేబరాన్ని కనుగొన్నారు. అటవీశాఖ ఉద్యోగులు అడవిలో నడుస్తుండగా తీవ్ర దుర్గంధం గుర్తించి ఘటనా స్థలానికి చేరుకోగా అక్కడ పులి కళేబరం, మరికొంత దూరంలో ఆవు కళేబరం కనుగొన్నారు.
*గంజాయిని అక్రమంగా దేశ సరిహద్దులు దాటించే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు నిందితులను నెల్లూరు టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.70 లక్షల విలువైన 430 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
*జగిత్యాల పట్టణానికి చెందిన అయ్యప్ప దీక్షపరుడు కేరళలోని శబరిమలైలో ఆకస్మికంగా మృతి చెందాడు. కొత్త బస్స్టాండ్ వద్ద నివాసం ఉంటున్న శ్రీగంధం రమేష్ శబరమలైలో పంబా నది వద్ద స్నానం చేస్తుండగా బ్రెయిన్ డెడ్తో మృతి చెందాడు. రమేష్ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈనెల 9న అయ్యప్ప దర్శనానికి బయలుదేరి వెళ్లారు. రమేష్ మృతి వార్త తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
* జీడిమెట్ల పారిశ్రామికవాడలోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. స్టీల్ ఫర్నెస్ బ్లాస్ట్ అయింది. దీంతో 8 మంది కార్మికులకు గాయాలు కావడంతో స్థానికులు దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. వీరిని యూపీ, బీహార్ కు చెందిన బిస్వేశ్వర్ దేవ్, ముఖేష్, పరివీర్ మహానాయక్, కమలేశ్ మిశ్రా, మహావేంద్రమ్, సురేష్ సింగ్ గా గుర్తించారు