రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలోని 3,052 వార్డులు, డివిజన్లకు 19,673 మంది అభ్యర్థులు 25,336 నామినేషన్లు వేశారు. స్క్రూటినీలో 432 నామినేషన్లు రిజెక్ట్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. టీఆర్ ఎస్ నుంచి అత్యధికంగా 8,956 నామినేషన్లు రాగా, కాంగ్రెస్ నుంచి 5,365, బీజేపీ నుంచి 4,179, టీడీపీ 433, ఎంఐఎం 441, సీపీఐ 269, సీపీఎం 268, ఎన్ సీపీ 36, బీఎస్ పీ 6, వైసీపీ 4, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి 385, రిజిస్టర్డ్ పార్టీల నుంచి 99 నామినేషన్లు వచ్చాయి. ఇండిపెండెంట్లుగా 4,895 మంది వేశారు. మొత్తం 25,768 నామినేషన్లు వేయగా 432 రిజెక్ట్ అయినట్లు అధికారులు వివరించారు.
నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గాను 1,042 నామినేషన్లు వచ్చాయి.
రామగుండంలో 50 డివిజన్లకు 785,
సూర్యాపేటలో 48 వార్డులకు 658,
మహబూబ్ నగర్ లో 49 వార్డులకు 596,
నల్గొండలో 48 వార్డులకు 580,
జగిత్యాలలో 48 వార్డులకు 457,
సంగారెడ్డిలో 38 వార్డులకు 445,
సిరిసిల్లలో 39 వార్డులకు 417,
జనగామలో 30 వార్డులకు 413,
పెద్దపల్లిలో 36 వార్డులకు 412,
ఆదిలాబాద్ లో 49 వార్డులకు 398,
నర్సాపూర్ లో 25 వార్డులకు 360,
బోధన్ లో 38 వార్డులకు 340,
జమ్మికుంటలో 30 వార్డులకు 338,
భూపాలపల్లిలో 30 వార్డులకు 326,
హుజూరాబాద్ లో 301,
గద్వాల్ లో 20 వార్డులకు 296,
వికారాబాద్ లో 34 వార్డులకు 282,
బడంగ్ పేట్ లో 32 డివిజన్లకు 281,
సదాశివపేటలో 26 వార్డులకు 280,
నిజాంపేటలో 33 డివిజన్లకు 273,
బెల్లంపల్లిలో 34 వార్డులకు 268,
వనపర్తిలో 33 వార్డులకు 266,
ఆర్మూర్ లో 36 వార్డులకు 265,
మెదక్ లో 32 వార్డులకు 237,
అమీన్ పూర్ లో 24 వార్డులకు 233,
కొత్తగూడెంలో 36 వార్డులకు 230,
దుబ్బాకలో 37 వార్డులకు 229,
జవహర్ నగర్ లో 28 డివిజన్లకు 229,
కొల్లాపూర్ లో 20 వార్డులకు 218,
మహబూబాబాద్ లో 36 వార్డులకు 228,
మేడ్చల్ లో 23 వార్డులకు 223,
నాగర్ కర్నూల్ లో 24 వార్డులకు 222,
శంషాబాద్ లో 25 వార్డులకు 208,
బోడుప్పల్ లో 28 డివిజన్లకు 208,
బాన్సువాడలో 19 వార్డులకు 205 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
స్క్రూటినీ తర్వాత మొత్తం నామినేషన్లపై ఈసీ ఇచ్చిన సమాచారంలో కొన్ని తప్పులు దొర్లాయి. పీర్జాదిగూడ కార్పొరేషన్ లో 26 డివిజన్లకు 165 మంది 252 నామినేషన్లు వేయగా.. ఈసీ ఇచ్చిన సమాచారంలో ఏడు మాత్రమే వ్యాలిడ్ నామినేషన్లు ఉన్నట్టుగా ప్రకటించారు. మిర్యాలగూడలో 48 వార్డులకు 536 నామినేషన్లు దాఖలు కాగా ఒకటి రిజెక్ట్ అయ్యింది. 334 మంది వేసిన 535 నామినేషన్లు సక్రమంగా ఉండగా, ఇక్కడ కేవలం 40 వ్యాలీడ్ నామినేషన్లు మాత్రమే ఉన్నట్టు ప్రకటించారు. ఈ రెండు మున్సిపాల్టీలను పరిగణనలోకి తీసుకుంటే నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య 20,172కు పెరగ్గా, మొత్తం నామినేషన్ల సంఖ్య 26,123గా ఉంది. ఈ విషయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జాబితాలో తప్పులపై ఎస్ ఈసీ అధికారులను వివరణ కోరగా టెక్నికల్ పొరపాట్లతో మొత్తం సంఖ్యలో మార్పు ఉందని, సోమవారం లిస్ట్ ను రివైజ్ చేస్తామని తెలిపారు.