DailyDose

వాల్‌మార్ట్‌లో ఉద్యోగాల ఊస్టింగ్-వాణిజ్యం

Walmart Removing Huge Number Of Employees-Telugu Business News Roundup

*దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగించాయి. ఇరాన్‌, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతున్నాయనే వార్తల నేపథ్యంలో మార్కెట్లు ట్రేడింగ్‌ ఉదయం ఆరంభం నుంచే పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 259 పాయింట్లు పెరిగి 41,859 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ 72 పాయింట్లు పెరిగి 12,329 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.79 వద్ద కొనసాగుతోంది. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేరు ధర ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 4శాతం పైగా లాభానికి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, కోల్‌ ఇండియా, గెయిల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో పయనించగా.. యస్‌ బ్యాంకు, యూపీఎల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టాటా కన్సల్టెన్సీ, ఐచర్‌ మోటర్స్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.
* భార‌త్‌లో వాల్‌మార్ట్ సంస్థ 50 మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. సంస్థ‌ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించాల‌న్న ఉద్దేశంతో ఆ కంపెనీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దేశ‌వ్యాప్తంగా వాల్‌మార్ట్ త‌న వ్యాపారాన్ని విస్త‌రించాల‌నుకున్న‌ది. కానీ ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డంలేదు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 28 వాల్‌మార్ట్ మాల్స్ ఉన్నాయి. వాటిల్లో కేవ‌లం చిన్న షాపుల వాళ్ల‌కు మాత్రం స‌రుకులను అమ్ముతారు. రిటేల్ వినియోగ‌దారుల‌కు స‌రుకుల‌ను అమ్మ‌రు. కంపెనీకి చెందిన రియ‌ల్ ఎస్టేట్ విభాగంలో ప‌నిచేసే 50 మందిని తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది. వ్యాపారం అంతా ఈ-కామెర్స్ వైపు మ‌ళ్ల‌డం వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.
*శాంసంగ్‌ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎక్స్‌కవర్‌ ప్రొ ను తాజాగా విడుదల చేసింది. ఇందులో… 6.3 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 9611 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, 25, 8 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 13 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఐపీ 68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ టైప్‌ సి, ఎన్‌ఎఫ్‌సీ, 4050 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.35,430 ధరకు ఈ ఫోన్‌ను త్వరలో విక్రయించనున్నారు.
* అమెజాన్‌‌ఫౌండర్‌‌‌‌ జెఫ్‌‌బెజోస్‌‌కి వ్యతిరేకంగా దేశమంతటా 300 సిటీలలో నిరసనలు చేపేట్టేందుకు కాన్ఫెడెరేషన్‌‌ ఆఫ్‌‌ఆల్‌‌ఇండియా ట్రేడర్స్‌‌(సెయిట్‌‌) సిద్ధమవుతోంది. ఢిల్లీలో జరగనున్న కంపెనీ ఈవెంట్‌‌లో పాల్గోనేందుకు బెజోస్‌‌వచ్చే వారం ఇండియాకు వస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ అధికారులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు తెలిపారు. దేశంలోని ఈ–కామర్స్‌‌కు సంబంధించి ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడే అవకాశం ఉందన్నారు. కాగా బెజోస్‌‌ఏ తేదిన ఇండియాకు వస్తున్నారు? ఎక్కడ స్టే చేస్తున్నారు? వంటి విషయాలు ఇంకా బయటకు రాలేదు. వీటిపై అమెజాన్‌‌ ఇండియా స్పందించలేదు. చిన్న చిన్న స్టోర్లను నిర్వహిస్తున్న ఏడు కోట్ల మంది రిటైలర్లను సెయిట్‌‌ రిప్రెజెంట్‌‌చేస్తోంది. బెజోస్‌‌కు వ్యతిరేకంగా దేశం మొత్తం మీద 300 సిటీలలో నిరసనలు చేస్తామని సెయిట్‌‌ పేర్కొంది. ఆఫర్లను అధికంగా ఇస్తున్నారని, ఎఫ్‌‌డీఐ రూల్స్‌‌ను అతిక్రమిస్తున్నారని అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌పై వీరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను ఈ రెండు కంపెనీలు ఖండించాయి. చిన్న వ్యాపారులకు, మహిళ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లకు, కళాకారులకు బిజినెస్‌‌ అవకాశాలను అందిస్తున్నామని అమెజాన్‌‌ పేర్కొంది. జెఫ్ బెజోస్‌‌కు వ్యతిరేకంగా ఢిల్లీ, ముంబై, కోల్‌‌కతా, చిన్న టౌన్లు, సిటీలలో శాంతియుతంగా ర్యాలీలు చేస్తామని సెయిట్ సెక్రటరీ జనరల్‌‌ప్రవీణ్‌‌ఖండేల్వాల్ అన్నారు. ఈ నిరసనల కోసం మొత్తంగా లక్ష మంది ట్రేడర్లను మొబిలైజ్‌‌ చేస్తామని అన్నారు. WhatsAppFacebookTwitterTelegramLinkedInShare
*వచ్చే బడ్జెట్లో భాగంగా ప్రభుత్వరంగంలోని సాధారణ బీమా కంపెనీలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో విడత మూలధనాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ కంపెనీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు మూలధనాన్ని అందించే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్లకు రూ.2,500 కోట్ల మూలధనం అందించింది.
*భారత్లోని 12 ప్రధాన పోర్టుల్లో సరుకు రవాణా (కార్గో) వృద్ధి ఓ మోస్తరుగా పెరిగింది. 2019 ఏప్రిల్-డిసెంబరు కాలంలో ఈ పోర్టుల్లో కార్గో కేవలం 0.98 శాతం వృద్ధి చెంది 524.02 మెట్రిక్ టన్నులు (ఎంటీ)గా ఉందని ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (ఐపీఏ) వెల్లడించింది. దీన్దయాళ్ పోర్టు అత్యధికంగా 92.41 ఎంటీల కార్గోను నిర్వహించగా.. పరదీప్ 83.61 ఎంటీలు, విశాఖపట్నం 53.53, జేఎన్పీటీ 50.72, కోల్కతా 47.09, ముంబై 46.16, చెన్నై 35.83, న్యూ మంగళూరు 27.60 ఎంటీల కార్గోను హ్యాండిల్ చేశాయని ఐపీఏ తెలిపింది.
*నిఫ్టీ గత వారం పటిష్టమైన కరెక్షన్ను చవిచూసి 11900 స్థాయిలకు చేరువైంది. చివరి రెండు ట్రేడింగ్ రోజుల్లో రికవరీ సాధించి 12000 ఎగువన నిలదొక్కుకుని పాజిటివ్ ట్రెండ్ను సూచించింది. గత శుక్రవారం స్వల్పకాలిక నిరోధ స్థాయిలైన 12300 వరకు వెళ్లి రియాక్షన్ను చవిచూసి అనిశ్చితిగా ముగిసినప్పటికి సానుకూల సంకేతాలను వెలువరించింది. గడచిన మూడు వారాలుగా కన్సాలిడేషన్, సైడ్వేస్ ట్రెండ్ను కనబరుస్తున్న నిఫ్టీ గతవారం పటిష్ఠంగా క్లోజైంది.
*ప్రస్తుత పరిస్థితుల్లో 2024నాటికి భారత ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకుపోవడం సాధ్యమయ్యే పనికాదని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అలా ఆశించడం అత్యాశే అవుతుందని ప్రముఖ ఆర్థికవేత్త ఆర్ నాగరాజ్ తెలిపారు. ‘జీడీపీ వృద్ధి రేటు పడిపోతోంది. ఈ నేపథ్యంలో ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అత్యాశగా కనిపిస్తోంది’ అన్నారు. ప్రస్తుతం భారత వార్షిక జీడీపీ 2.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. దీన్ని 2024నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
*సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) సంబంధిత ఉద్యోగాలు 2016 నవంబరు నుంచి 2019 నవంబరు మధ్యకాలంలో 44శాతం పెరిగాయని ఇండీడ్ వెబ్సైట్ పేర్కొంది. ఆ మూడేళ్ల కాలంలో తమ వెబ్సైట్లో జరిగిన పోస్టింగ్స్, సెర్చింగ్స్ ఆధారంగా నివేదికను తయారుచేసినట్లు వెల్లడించింది. రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి పలు సాంకేతికతల్లో వస్తున్న పురోగతి కారణంగా ఉద్యోగార్థులకు స్టెమ్ కొలువులు అత్యంత నమ్మకమైనవిగా మారాయని వివరించింది.