భార్యలు భర్త నుంచి ఆశించే విషయాలు ఇవే..
ఏ రిలేషన్ షిప్ అయినా సరే.. అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే ఆ బంధం కలకాలం హ్యాపీగా ఉంటుంది. కొంతమందికి ఈ విషయం బాగా తెలుసు. కాబట్టి..వారు ఆనందంగా జీవిస్తూ ఉంటే.. మరికొంతమందికి ఈ విషయం అర్థం కాక విడిపోతుంటారు. ఈ నేపథ్యంలోనే దాంపత్య జీవితంలో భార్యలు భర్త నుంచి కొన్ని విషయాలను ఆశిస్తారు. అవి దొరక్కపోయే సరికి విసుగు చెంది భర్తలతో గొడవలకు దిగుతారు. మరి భార్యలు భర్తల నుంచి ఆశించేవి ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
ప్రేమ..
మగవారు ప్రేమ అనేది కొన్ని సందర్భాల్లోనే చూపుతారు.. అర్థం చేసుకుంటారు. కానీ, మహిళలు అలా కాదు.. ప్రతీ విషయంలోనూ ప్రేమగా ఉండాలనుకుంటారు. ఏ పని చేసినా అందులో ప్రేమ ఉండాలని కోరుకుంటారు. కాసింత ప్రేమగా మాట్లాడుతూ వారికోసం చిన్న చాక్లెట్ ఇచ్చినా మురిసిపోతారని చెబుతున్నారు పరిశోధకులు. కాబటి మగ మహారాజులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెబుతున్నారు.
దాపరికాలు వద్దు..
సతులు.. తమ పతులు ఏ విషయంలోనూ దాపరికాన్ని ప్రదర్శించొద్దు అని కోరుకుంటారు. ఏ విషయంలోనైనా భర్తలు తమ దగ్గర అన్ని చెప్పాలని, ఓపెన్‌గా ఉండాలని కోరుకుంటారు. ఏదైనా విషయంలో తప్పు చేసినా.. అది చెప్పడం మంచిదని, అంతేకానీ, అబద్ధాలు చెబుతూ కాలం వెళ్లదీసేలా ఉండొద్దని కోరుకుంటారని చెబుతున్నారు నిపుణులు.
ఓదార్పు..
ఏదైని విషయంలో భార్యలు బాధపడుతుంటే వారిని భర్తలు ఓదార్చాలి. అంతేకానీ, పట్టీ పట్టనట్లు ఉండడం, పట్టించుకోకపోవడం ఇలాంటివి బంధాన్ని నీరుగారుస్తాయి. కాబట్టి.. కచ్చితంగా భర్తలు స్త్రీలు బాధపడుతుంటే ఓదార్చడం నేర్చుకోవాలి. వారిని దగ్గరికి తీసుకుని విషయం ఏంటో కనుక్కోవాలి. ఇలా చేసినప్పుడు వారి మనసులో మీ స్థానం పదిలంగా ఉంటుంది.
గౌరవం..
భార్యలను గౌరవించడం కూడా చాలా ముఖ్యమైన పని. కొంతమంది భర్తలు నలుగురిలోనూ తమ భార్యలను చులకనగా చూస్తారు. ఇలాంటి విషయాలను భార్యలు అస్సలు సహించలేరు. తమని పది మందిలో గౌరవంగా చూడాలని కోరుకుంటారు. ఇలాంటి మగవారినే భార్యలు ఇష్టపడతారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భార్యలు తమ భర్తలను అత్యంత ఇష్టపడతారని చెబుతున్నారు పరిశోధకులు.