సంక్రాంతి పండగ అనగానే గుర్తొచ్చేది కోడి పందేలాట. ఈ ఆటను గురువు ప్రదేశమున ఆయా ఆటలు జరుపుకునే కొన్ని గ్రామములు దగ్గర
ఇప్పటికీ ఈ ఆటలు లేకపోయినను కోడిపందాల గురువు అను పేర కొన్ని గ్రామాలలో స్థల వ్యవహారం ఉన్నది.” కోడి పందెములు” మన దేశములో
ఇప్పటికీ 1000 సంవత్సరములకు పూర్వము నుండి వాడుకలో ఉన్నాయంట. దీనిని పదునైదవ శతాబ్దములో మన దేశాన్ని దర్శించ వచ్చిన యాత్రికులు కూడా వర్ణించి యున్నారు. ఇది దక్షిణ హిందూ దేశంలోనే కాక., జావా, సుమత్రా మొదలైన
దేశాలలో సైతము వాడుకలో ఉండినట్లు వారి వృత్తాంతము వల్ల తెలియుచున్నది. కోడిపోరుపూర్వపు సంస్థానాధీశులకు ప్రియమైన వేడుకలలో ఒకటి అని పెద్దాపురపు” కోడిపుంజుల కథ” మొదలైన జానపద గేయముల వలన తెలియుచున్నది. కోడి పందెములు గొప్ప యుద్ధమునకు కారణమైనవి. పలనాటి వీర యుద్ధమునకు గల కారణములలో కోడిపందెం ఆట ఒకటి.
ఇప్పటికీ కూడా కోస్తా ప్రాంతంలో కోడిపందాల ఆటలు సంక్రాంతి పండక్కు ముమ్మరంగా జరుగుతాయి. కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరుగుతున్నాయి. సాంప్రదాయ ఆటగా గుర్తించి
నాయకులు కూడా ఇందులో పాల్గొంటున్నారు.
కోడి కత్తి కట్టకుండా ఆడుకోవచ్చు అని అంటున్నారు. సంక్రాంతి సరదాలలో పశువులకుముఖ్యమైన పండుగగా చెప్పొచ్చు.
పూర్వము వేడుకలలో వినోదాలలో కోడిపందెం వంటి ఆటలే కాక ఇంకా చాలా ఉన్నవి. ఈ విషయం క్రీడాభిరామము, భోజరాజీయము మొదలైన గ్రంథాలలో పేర్కొనబడినవి. వృషభములపోరు,
మేష యుద్ధము, దున్నపోతుల పోరు, గజ యుద్ధము, పొట్టేళ్ల పోరు మొదలైనవి.ఇవి మధ్య యుగములో ఇప్పటికి తొమ్మిది వందల సంవత్సరాలకు పూర్వము ప్రజలకు చాలా వినోదమును, ఆనందమును కలిగించేవి. కాలక్రమేణా ఈ ఆటలు చాలా వరకు నశించి పోయినవి. మన సంస్కృతి సంప్రదాయాలలోమనకు తెలియకుండానే ఎన్నో వినోదాలు, ఆటలుకాలగర్భంలో కలిసిపోయినవి . ఇంకా కొన్నాళ్ళు పోతే తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి.
ఇంటర్నెట్లో వెతుక్కోవలసిన పరిస్థితులు వస్తాయి.
పిల్లలకు వారసత్వంగా మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా అందించాలని కోరుకుంటున్నాను.