అనార్కలి, చుడీదార్‌లకు దుపట్టా ఇచ్చే అందం అంతా ఇంతా కాదు. క్రియేటివిటీ ఉండాలేగానీ దుపట్టాలకు కొత్త సొబగులు అద్ది మరింత ఆకర్షణీయంగా తయారు చేయడం కష్టమేమీ కాదు. అలా తయారైన రెడీమేడ్ దుపట్టాలే ఇవి!
ప్లెయిన్ టాప్‌కు గోల్డ్ కలర్ దుపట్టా చక్కగా నప్పుతుంది. ఎంబ్రాయిడరీతోపాటు, త్రెడ్ వర్క్ ఉన్న ఈ దుపట్టాకు ఫ్రింజ్‌డ్ బార్డర్ ప్రత్యేక ఆకర్షణ. లినెన్ మెటీరియల్‌తో తయారైన ఈ దుపట్టా ధర రూ.552.
బ్లాక్ అండ్ రెండ్ కాంబినేషన్ చూడముచ్చటగా ఉంటుంది. అలాంటి కాంబినేషన్ మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే ఇదిగో ఇలా ఆరి వర్క్ ఉన్న దుపట్టా ధరించాలి. షిఫాన్ మెటీరియల్‌తో తయారైన ఈ దుపట్టా ధర రూ.584.
ఎర్రని ప్లెయిన్ లాంగ్ కుర్తా వేస్తే, కాంట్రాస్ట్ దుపట్టా వేసుకోవాలి. రెడ్ అండ్ బ్రీజ్ ఎంబ్రాయిడరీ, త్రెడ్‌వర్క్ ఉన్న ఈ దుపట్టా బార్డర్ కూడా ప్రత్యేకమే! వూవెన్ బార్డర్‌తో నెట్ మెటీరియల్‌తో తయారైన ఈ దుపట్టా ధర రూ.749.
బ్లాక్‌కు హాఫ్ వైట్ మరో అదిరిపోయే కాంబినేషన్. టేపింగ్ బార్డర్, కాటన్ సిల్క్ మెటీరియల్‌తో తయారైన ఈ దుపట్టా ధర రూ.711.