Politics

ఆంధ్రుల ఓట్ల కోసం కేసీఆర్ సమావేశాలు

Ponnala Slams KCR Strategey On Krishna Water

ఆంధ్రా ప్రాంత ఓటర్లున్న మున్సిపాలిటీల్లో కొద్దోగొప్పో ఓట్లు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశపడుతూ ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం గురించి మాట్లాడితే నీటిపారుదల శాఖల కార్యదర్శులు సమావేశంలో ఎందుకు లేరు? అధికారులు లేకుండా ఇద్దరు సీఎంలు చర్చలు జరపడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దుమ్ముగూడెం సాగర్‌ టేల్‌పాండ్‌ ఏర్పాటుకు ప్రతిపాదన చేసి పనులు ప్రారంభిస్తే అప్పుడు నానా హంగామా చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తే తప్పేంటి అన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో రూ.2 వేలు తీసుకోని ఓటేయాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఓటర్లను అవినీతి వైపు ప్రోత్సహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ తెలిపారు. ట్విటర్‌ వేదికగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు.