శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చాలా మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అలా కాకుండా ఆహారం విషయంలో కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. కొన్ని కూరగాయలు కూడా సెక్స్ డ్రైవ్‌ని పెంచుతాయి. అవేంటో ఇప్పుడు చూడండి.
దంపతుల మధ్య గొడవలు తలెత్తడానికి వారి దాంపత్య జీవితం కూడా ఓ కారణం. చాలా మంది జంటలు సెక్స్ ప్రాబ్లమ్స్ కారణంగా విడిపోతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ప్రతీ సమస్యకి ఆస్పత్రుల చుట్టూ తిరగడం కంటే కొన్ని సమస్యలను ఆహార పదార్థాల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. అలానే సెక్స్ స్టామినాను పెంచే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే, ఇప్పుడు చెప్పే ఆహార పదార్థాలతోనే ఎలాంటి లైంగిక సమస్యలన్నీ దూరం అవుతాయని కాదు.. కానీ, కొంతవరకూ ఉపయోగం ఉంటుంది. ముందుగా ఆ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం.
పొట్లకాయలు..
పొట్లకాయలు.. పచ్చడి, పులుసు చేసే పొట్లకాయలను ఎక్కువమంది తినరు. చాలా తక్కువ మంది తింటుంటారు. అయితే, ఇందులోని ప్రత్యేక గుణాలు చాలా వరకూ అనేక సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా వరకూ ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా శరీరానికి చలువ చేస్తుంది. ఆయాసం, ఉబ్బసం ఉన్నవారు ఎక్కువగా పొట్లకాయ తినడం సమస్యలు దూరం అవుతాయి. పొట్లకాయ తినడం వల్ల లైంగిక సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
కొంతమంది పరిశోధకులు తెలిపిన వివరాల లైంగిక సమస్యలతో బాధపడేవారిని రెండు భాగాలుగా విభజించారు. ప్రకారం పొట్లకాయని రెగ్యులర్‌గా తిన్నవారు కొన్ని రోజుల్లోనే అలాంటి సమస్యల తీవ్రత తగ్గినట్లుగా గుర్తించారు. కాబట్టి లైంగిక సమస్యలతో బాధపడేవారు పొట్లకాయని తమ డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
అదే విధంగా పొట్లకాయ తింటే పిల్లల కడుపు క్లీన్ అవుతుంది. వారి కడుపులోని నులిపురుగులను పోగొట్టడంలో పొట్లకాయ బాగా పనిచేస్తుంది.
ఇక ఇదే కూరగాయ జాతికి చెందిన సొరకాయ కూడా లైంగిక సమస్యలకు చక్కని పరిష్కారం. ఇందులోనూ అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల పురుషులలో వీర్య వృద్ధి, లైంగిక శక్తి పెరుగుతాయి. సోరకాయను తరచుగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
సోరకాయ ముదురు గింజలను వేయించి.. వాటితో పాటు ఉప్పు, ధనియాలు, జీలకర్రని కలిపి పొడి చేసి అన్నంలో కలిపి తింటే చాలా మంచిది. ఇలా తినడం వల్ల మగవారిలో లైంగిక సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా వీటిని తినడం వల్ల శరీరంలో వేడి, కఫం తగ్గుతుంది. దప్పిక కూడా తగ్గుతుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూతతో బాధపడేవారు ఈ ఆహారాన్ని తీసుకుంటే మంచిది. గుండె సమస్యలకి సొరకాయ కూర చాలా మంచి ఆహారం. హార్ట్ డిసెజెస్‌తో బాధపడేవారు.. రెగ్యులర్‌గా సొరకాయని రెగ్యులర్‌గా తినాలి.
వీటితో పాటు మరికొన్ని మీ డైట్‌లో చేర్చుకోండి. దీనివల్ల చాలావరకూ లైంగిక సమస్యలన్నీ దూరం అవుతాయి. పాలకూర, ఫ్యాటీ ఫిష్, గ్రీన్ టీ, నట్స్, వెల్లుల్లి, అల్లం, దానిమ్మ, పుచ్చకాయ ఇలాంటివాటివన్నీ కూడా రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి.
అయితే, కేవలం వీటిని తినడం వల్లే ఏ సమస్యలున్నా దూరం అవుతాయని కాదు.. కానీ, సమస్య తీవ్రతను ఈ ఆహార పదార్థాలు చాలావరకూ దూరం చేస్తాయి. ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి..
ఎక్కువ మంది దంపతులు సెక్స్ విషయంలో అనేక తప్పులు చేస్తుంటారు.
సెక్స్ అంటే కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమేనని భావిస్తుంటారు. అలా ఆలోచించకూడదు. సెక్స్ అనేది ప్రేమతో భాగస్వామిని దగ్గరకు తీసుకుని మాట్లాడుతూ ఇష్టంగా చేయాలి. అంతేకానీ, ఏదో అయ్యిందా అని అన్నట్లు కాకుండా ప్రేమతో ఇద్దరూ దగ్గరవ్వాలి.
అప్పుడే మీరు ఆ పనిని ఆనందంగా చేయగలరు.
మరికొంతమంది దంపతులు కేవలం పిల్లల్ని కనడం కోసమే అన్నట్లుగా సెక్స్ చేస్తుంటారు. అలా ఆలోచించడం సరికాదు.. సెక్స్ చేయడం వల్ల మీ అనుబంధం మరింత పెరుగుతుందని గుర్తుంచుకోండి అంతేనా.. దీని వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
కొన్ని పరిశోధనల్లో తేలిన విషయమేంటంటే.. 5 రోజుల వర్కౌట్ చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి. అన్నీ ప్రయోజనాలు ఒక్కసారి సెక్స్ చేయడం వల్ల ఉంటాయని తేలింది.
సెక్స్ చేయడం వల్ల మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మనల్ని హ్యాపీ, హెల్దీగా ఉండేలా చేస్తాయి.
శృంగారం చేయడం వల్ల మనసు, శరీరం కూడా రిలాక్స్ అవుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది.
అదేవిధంగా సెక్స్ విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. ఈ సమయంలోనే చేయాలి. ఇలానే చేయాలి. అంటూ కొన్ని నియమాలు పెట్టుకుంటున్నారు. కానీ, శృంగారం విషయంలో అలాంటివేమీ లేవు. ఇద్దరికీ ఇష్టమైతే శృంగారం.. ఎప్పుడైనా, ఎలా అయినా చేయొచ్చు. అయితే, అది మీ పార్టనర్‌కి నచ్చాలి. అప్పుడే మీరు దాన్ని ఎంజాయ్ చేయగలరు. ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.