ScienceAndTech

ఫోను మాట్లాడండి. మొటిమలను పిలవండి.

Using Smartphone For Longer Durations Might Cause Acne

చాలా మంది ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. కానీ, తాజాగా కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఫోన్ మాట్లాడితే మొటిమల సమస్య ఎదురవుతుందని తేలింది. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మొటిమలు.. టీనేజీలోకి అడుగుపెట్టగానే చాలా మందికి మొటిమల సమస్య మనపై దాడిచేస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్య అంత త్వరగా తగ్గదు. ఇలా మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. జీవన విధానం, లైఫ్ స్టైల్ ఇలా ప్రతీ ఒక్కటి ఈ సమస్యకి కారణాలుగా ఉంటాయి. మనం చేసే తప్పుల కారణంగానే ఈ సమస్య మనకి ఎదురవుతుంది.

*** ఒత్తిడి..
ఎక్కువగా ఒత్తిడిగా ఫీల్ అయ్యేవారికి కూడా మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడిగా ఫీల్ అయ్యే వారి శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ముఖంపై మొటిమల సంఖ్యని పెంచుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్య అంత త్వరగా తగ్గదు. కాబట్టి మొటిమలతో బాధపడేవారు ఒత్తిడిగా ఫీల్ అవ్వొద్దని చెబుతున్నారు. ఒత్తిడిగా ఫీలైతే కేవలం మొటిమల సమస్య మాత్రమే కాదు.. ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకోవాలని చెబుతున్నారు.

*** ఫోన్ ఎక్కువగా మాట్లాడడం కూడా ఓ కారణమే..
అవును… ఇది ఆశ్చర్యంగా అనిపించినా నిజమేనని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. నిజానికీ ఫోన్ మాట్లేడప్పుడు మనం ఫోన్‌ని ముఖం దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటాం. దీని వల్ల ఫోన్‌కి ఉన్న బ్యాక్టీరియా మన ముఖానిపై చేరి మొటిమల సమస్యకి కారణంగా మారుతుంది. అదే విధంగా ఫోన్‌కి చెమట అంటుకుని అది ముఖానిపై చేరి మొటిమల సమస్య మరింత అధికమవుతుంది. కాబట్టి ఫోన్ మాట్లాడేటప్పుడు కాస్తా దూరంగా పెట్టుకుని మాట్లాడాలి. అదే విధంగా ఎప్పటికప్పుడూ ఫోన్‌ని క్లీన్ చేసుకుని మాట్లాడితే సమస్య అంతగా ఉండదని చెబుతున్నారు.

*** అతిగా స్క్రబ్బింగ్..
చర్మాన్ని స్క్రబ్ చేయడం ముఖ్యమే.. ఎందుకంటే దీని వల్ల చర్మంలోని చర్మకణాలు తొలగిపోతాయి. అయితే, మొటిమల సమస్యల ఉన్నవారు స్క్రబ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే స్క్రబ్బింగ్ వల్ల చర్మ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. కాబట్టి మొటిమలతో బాధపడేవారు స్క్రబ్బింగ్‌కి దూరంగా ఉండాలి.

*** అతిగా ఫేస్ వాష్ వద్దు..
ముఖం కడగడం వల్ల కూడా ఫేస్ క్లీన్ అవుతుంది. మొటిమల సమస్య తగ్గుతుంది. కానీ, అతిగా కడగడం లాంటివి చేయకండి ఇలా చేయడం వల్ల చర్మంలోని సహజనూనెలు తగ్గి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ముఖంలోని సహజ తేమ తగ్గి నూనె ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి ఇలా ఎప్పుడూ చేయకూడదని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల త్వరగా మొటిమల సమస్య తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా సరైన నిద్ర, జీవన విధానం లేకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వంటివి కూడా మొటిమల సమస్యను తీవ్రతరం చేస్తుందని అంటున్నారు కాబట్టి.. అన్ని విధాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల త్వరగానే సమస్య తగ్గి ముఖం కాంతి వంతంగా మారుతుందని చెబుతున్నారు. వీటితో పాటు యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటే చాలా వరకూ సమస్య దూరం అవుతుందని చెబుతున్నారు.