ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అంతా వాతావరణ మార్పుల వల్లే అంటూ ప్రకృతి మీదకి నెట్టేయడం సరికాదు. అవి జరగడానికి మనమే బాధ్యులం అనే విషయాన్ని గుర్తించి ఇకపై అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి అంటోంది ఆస్ట్రేలియా పర్యటకశాఖ తరఫున రాయబారిగా పనిచేస్తున్న పరిణీతి చోప్రా…‘పర్యావరణ పరిరక్షణకు మనమందరం ఐకమత్యంగా కృషి చేయాలనే’ పరిణీతి ఆస్ట్రేలియాతో తనకున్న అనుబంధాన్ని ఇలా పంచుకుంది. ‘మూడేళ్ల నుంచి ఆస్ట్రేలియా పర్యటకశాఖ తరఫున రాయబారిగా పనిచేస్తున్నా. మన దేశం నుంచి ఈ స్థానాన్ని దక్కించుకున్న తొలి భారతదేశ మహిళను నేనే. చిన్నప్పటి నుంచి ప్రయాణాలంటే ఇష్టపడే నేను ఏడాదిలో కనీసం అయిదు కొత్త దేశాలైనా చుట్టివస్తా. నా మనసులో ఆస్ట్రేలియాది ప్రముఖ స్థానం. స్వర్గాన్ని పోలి ఉండే ఈ దేశాన్ని నేను అందమైన నక్షత్రంలా భావించేదాన్ని. మొదటిసారి అక్కడకు వెళ్లినప్పుడు ఆ నేలను ముద్దాడి, సాష్టాంగ నమస్కారం చేశా. అటువంటి అద్భుతమైన నేల ఇప్పుడు మంటలకు ఆహుతైపోతుందంటే బాధగా ఉంది’ అని అంటోంది పరిణీతి.
అలా నెట్టేయడం సరికాదు
Related tags :