ప్రముఖ బాలీవుడ్ తార సోనమ్ కపూర్ లండన్‌లో తనకు ఓ భయంకరమైన అనుభవం ఎదురైందని తెలిపారు. లండన్‌లోని ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఆ డ్రైవర్ ప్రవర్తనకు తాను వణికిపోయానని చెప్పారు. ఈ విషయాలను ఆమె తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ‘‘లండన్‌లో ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న నాకు ఓ భయానక అనుభవం ఎదురైంది. మీరూ ఎంతో జాగ్రత్తగా ఉండండి. సురక్షితమైన ప్రజా రవాణా సర్వీసులను ఎంచుకోండి. నేనైతే వణికిపోయా’’ అంటూ ట్విటర్‌లో తనను అనుసరిస్తున్న అభిమానులను ఉద్దేశించి సోనమ్ ట్వీట్ చేశారు. అయితే, అసలేం జరిగిందని ఓ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ఉబర్ డ్రైవర్ గట్టిగా అరుస్తూనే ఉన్నాడని చెప్పారు. ఆ అరుపులకు తాను వణికిపోయానన్నారు. దీనిపై ఉబర్ సంస్థ కూడా స్పందించింది. జరిగిన దానికి ఆమెకు క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
సోనమ్‌ను వణికించిన ఊబర్
Related tags :