అగ్నిసాక్షిగా జరిగే పెండ్లిలో వధూవరులను ఒక్కటి చేసి, వారిలో ప్రేమ విత్తనాన్ని నాటేదే కొంగుముడి తంతు. వధువు చీర కొంగును, వరుడి ఉత్తరీయం అంచునూ కలిపి ముడివేస్తారు. సుముహూర్తం తర్వాత కళ్యాణ కార్యక్రమాలన్నీ ముగిసే వరకూ కొత్త దంపతులిద్దరూ ఇలా కొంగుముడితోనే నడయాడుతుంటారు. దీని పరమార్థం ఈ వధూవరులిద్దరిలోనూ అన్యోన్యతానురాగాలను వికసింపజేయడమే. పరస్త్రీలవైపు కన్నెత్తి చూడకుండా మనస్ఫూర్తిగా ఏకపత్నీ వ్రతాన్ని వరునికి, అంతే ప్రేమ, భక్తిభావాల మధ్య పతివ్రతగా తనను తాను తీర్చిదిద్దుకొనే దీక్షను వధువుకు బోధించే మంత్రయుక్త ఉపదేశమే ఈ కొంగుముడి. వీరిద్దరి దృఢప్రతిజ్ఞకు మంత్రోచ్ఛారణల నడుమ ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది. ఇద్దరం ఒకరి కొకరం తోడు నీడగా ఉందామని, పరస్పరం విడిచి వెళ్లే పరిస్థితే వస్తే ‘దు:ఖంతో దూరమై, శీఘ్రంగా తిరిగి వెను తిరిగి వస్తామన్న’ భావనను వ్యక్తపరుస్తూ, జీవితాంతం కలిసిమెలిసి ఉండాలన్న ప్రతిన బూనడమే ఇది.
కొంగుముడిలో ప్రేమ ఉందా?
Related tags :