ఢిల్లీ మహాత్మా గాంధీకి భారతరత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అలాంటి ఆదేశాలు ఇవ్వలేని ఇవాళ అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.
మహాత్మా గాంధీ మహోన్నతమైన వ్యక్తి అని, ఆయనకు ఉన్న గుర్తింపు చాలా విశాలమైనదని కోర్టు అభిప్రాయపడింది.
భారత రత్న బిరుదు కన్నా.. మహాత్మాగాంధీ ఎంతో ఉన్నతుడని కోర్టు పేర్కొన్నది.
మహాత్మా గాంధీ.. జాతిపిత అని, ఆయన్ను ప్రజలు ఎంతో ఉన్నతంగా చూస్తారని, ఆయనకు ఉన్న గుర్తింపు అనన్యమైందని కోర్టు తెలిపింది.
గతంలోనూ ఇదే అంశంలో కోర్టులో పలుమార్లు పిల్స్ వేశారు. కానీ కోర్టు తిరస్కరిస్తూనే వచ్చింది.
మహాత్మా గాంధీకి భారతరత్న ఇవ్వడం అంటే ఆయన్ను, ఆయన చేసిన సేవలను తక్కువ చేసి చూడడం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.