Politics

నాకు ఉరిశిక్షపైనే తప్ప రాజకీయాలపై ఆసక్తి లేదు

Nirbhaya's Mom Says She Is Not Interested In Politics

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమేదీ తనకు లేదని నిర్భయ తల్లి పేర్కొన్నారు. దిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తులతో మాట్లాడానని వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ఎన్నికల్లో పోటీ విషయమై కాంగ్రెస్‌ పార్టీ నుంచి గానీ, ఏ ఇతర పార్టీ నుంచి గానీ తనను సంప్రదించలేదని చెప్పారు. ఇలాంటి వార్తలు ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ‘‘నాకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. నా కూతురికి కోసం, అలాంటి మరెంతో మంది కుమార్తెల కోసం నేను పోరాడుతున్నా. నా కూతురికి న్యాయం జరగాలంటే ఆ నలుగురిని వెంటనే ఉరితీయాలి’’ అని నిర్భయ తల్లి పేర్కొన్నారు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమల్లో జాప్యంపై భాజపా, ఆప్‌ పరస్పరం విమర్శించుకోవడంపై ఆమె మాట్లాడుతూ.. రెండు పార్టీలు తన కుమార్తె మరణాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే మరణశిక్ష అమలును వాయిదా వేస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు.