శృంగార జీవితం అనేది ప్రతి జీవికి ముఖ్యమైనది. అది అనుభవించే తీరును బట్టి ఆనందం, ఆహ్లాదం, సంతోషం, సుఖం ఉంటాయి. వివరంగా చెప్పాలంటే.. శృంగారం అనేది ఒక సముద్రం లాంటిది. అందులో ఎంత లోతుకు వెళ్తే అంత సుఖం దక్కుతుంది.
శృంగార జీవితం అనేది ప్రతి జీవికి ముఖ్యమైనది. అది అనుభవించే తీరును బట్టి ఆనందం, ఆహ్లాదం, సంతోషం, సుఖం ఉంటాయి. వివరంగా చెప్పాలంటే.. శృంగారం అనేది ఒక సముద్రం లాంటిది. అందులో ఎంత లోతుకు వెళ్తే అంత సుఖం దక్కుతుంది.
ప్రస్తుతం శృంగారానికి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరుకుతోంది కాబట్టి.. దాని గురించి ఈజీగా తెలుసుకునే వీలు కలుగుతోంది. అయితే.. ఇంటర్నెట్‌లో ఎంత సమాచారం దొరికినా.. కామసూత్ర ముందు దిగదుడుపే. అలాంటి కామసూత్ర గురించి ఇప్పుడిప్పుడే లోకానికి అవగతం అవుతోంది. అందులోని కీలక అంశాలను మనం తెలుసుకోవాల్సిందే.
కామసూత్ర అత్యంత ప్రాచీనమైన, అవసరమైన గ్రంథం. ఇది మానవ జీవితానికి ముందు చూపులాంటిది.
ఈ ప్రాచీన హిందూ గ్రంథాన్ని మానవ లైంగిక సంబంధాల విధానం కోసం ఉపయోగిస్తున్నారు.
దీన్ని రెండో శతాబ్ధంలో జీవించిన వాత్సాయనుడు రాశాడు. అదీ.. అసభ్యత ఎక్కడా లేకుండా.
‘కామ’ అంటే కోరిక అని అర్థం. కోరికను తీర్చుకోవడానికి కావాల్సిన సూత్రాలను పొందుపరిచిందే కామసూత్ర. ముఖ్యంగా స్త్రీ, పురుషుల మధ్య లైంగిక కోరికను తీర్చేందుకు ఉపయోగపడేది.
ఇందులో పొందుపరిచిన సెక్స్ పొజిషన్స్ ఎన్నో ఉన్నాయి. అయితే, మన నిజజీవితంలో ఇందులోని 20 శాతం వాటిని మాత్రమే ఉపయోగిస్తున్నాం.
ప్రేమ, కోరికకు సంబంధించిన విషయాలు ఇందులో పొందుపరిచాడు వాత్సాయనుడు. సెక్స్‌లో ఉండే మంచి, చెడును వివరించాడు.
కామసూత్ర మొత్తం 1250 పద్యాలతో, 36 అధ్యాయాలతో, 7 భాగాలుగా నిండి ఉంది.
ఆ 7 విభాగాలు ఏంటంటే.. దాత్తక(1), సువర్ణనాభ(2), ఘోతకముక్త(3), గోనార్ధియ(4), గోనికాపుత్ర(5), ఛారయాన(6), కుచుమార(7) పార్టులుగా ఉన్నాయి.
జీవితంలో నాలుగు దశలను పూర్తి చేసుకోవాలని చెబుతుంటారు. అవి ధర్మ, అర్థ, కామ, మోక్ష. అందులో ఒకటి కామ.
వాత్సాయనుడు చెప్పిన ప్రకారం.. అర్థసాధనకు కావలసిన విద్యను బాల్యంలోనే అభ్యసించాలి. యవ్వన దశ కామ సాధనకు అనువుగా ఉంటుంది. వార్ధక్య దశ దగ్గరయ్యేకొద్దీ మనిషి ధర్మసాధనపై దృష్టి సాధించి, మోక్షానికి ప్రయత్నించాలి.
కోరిక తీర్చుకునే క్రమంలో మనిషి ప్రమాదంలో పడితే కలిగే నష్టాలు, ప్రమాదంలో పడకుండా చెప్పే జాగ్రత్తలు కూడా కామసూత్రలో ఉన్నాయి.
కామసూత్ర అనేది ఏదో ఒక మతానికి చెందినది కాదు.
కామసూత్రను తొలిసారి ఆంగ్లంలో ప్రైవేటుగా 1883లో ప్రింట్ చేశారు. దానికి మూలం.. భారత పురావస్తు శాస్త్రవేత్త భగవాన్ లాల్ ఇంద్రాజీనే.
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న కామసూత్ర.. కొద్ది భాగం మాత్రమే.