మూడు రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకోవాలని, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరులో నలుగురు యువ రైతులు సెల్ టవర్ ఎక్కారు. ఆత్మహత్య చేసుకుంటామంటూ శివ, బ్రహ్మయ్య, సాంబయ్య, ఫణి నిరసనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే వచ్చే వరకు టవర్ దిగేది లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళతామని సీఐ హామీ ఇవ్వడంతో వారు కిందకి దిగారు. రాజధానిని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
అమరావతి కోసం సెల్ టవర్ ఎక్కిన రైతులు
Related tags :