అగ్రకథానాయకుడు రజనీకాంత్‌పై కేసు నమోదయ్యింది. సంఘ సంస్కర్త పెరియార్ గురించి రజనీకాంత్ తప్పుడు ప్రచారం చేశారంటూ ఓ సంఘం అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. 1971లో పెరియార్ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని తెలిపారు. దీంతో రజనీకాంత్.. పెరియార్ గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ ద్రవిడర్ విడుదలై కళగమ్ అధ్యక్షుడు మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రజనీకాంత్ వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు రజనీపై కేసు నమోదు చేశారు.
తప్పుడు ప్రచారం చేసినందుకు రజనీపై కేసు
Related tags :