అన్ని పండ్లూ ప్రతి కాలంలోనూ దొరకవు. ఒక్కో కాలానికి ఒక్కో పండు ప్రత్యేకం. అలా కమలాపండ్లు చలికాలంలోనే దొరుకుతాయి. వైద్య నిపుణుల ప్రకారం.. ప్రతి ఒక్కరూ సీజనల్ పండ్లను తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలుంటాయి. చలికాలంలో విరివిగా కమలాపండ్లు లభిస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఎన్నో లాభాలున్నాయి. చలికాలంలో విరివిగా కమలాపండ్లు లభిస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఎన్నో లాభాలున్నాయి. అవి.
* కమలాపండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. కారణంగా బరువు తగ్గుతారు.
* కమలాపండులో ఫైబర్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉండి బ్లడ్ షుగర్ ప్రమాణాలు నియంత్రణలో ఉంటాయి.
* కమలాపండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా మారతాయి.
* ఆరోగ్యపరంగానే కాదు.. అందాన్ని కూడా పెంచుతాయి కమలాపండ్లు. ఈ కాలంలో చలివల్ల చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. కమలాపండ్లను తినడం వల్ల అలాంటి ఇబ్బందులు తలెత్తవు.
* తరచుగా కమలాపండ్లను తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారి.. వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి.
* కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి పొడిచేసి నలుగుపిండిలా వాడితే నునుపైన చర్మం సొంతమవుతుంది. అంతేకాక చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
* కమలాపండులో ‘సి’ విటమిన్ అధికంగా ఉంటుంది.. కాబట్టి చర్మవ్యాధులు, దంత సమస్యలు దరిచేరవు.
* కమలాపండును తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధమవుతుంది
కమలా పండ్లు విరివిగా తినాలి
Related tags :