సానియా మీర్జా మళ్లీ టైటిల్ కొట్టింది. ఆస్ట్రేలియాలో జరిగిన హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది.
ఉక్రెయిన్ ప్లేయర్ నదియా కిచెనోక్‌తో కలిసి సానియా మీర్జా.. ఫైనల్లో అదరగొట్టింది.
సానియా జోడీ 6-4, 6-4 స్కోర్‌తో ఫైనల్లో చైనాకు చెందిన జాంగ్ షువాయ్, పెంగ్ షువాయ్ జోడిపై గెలుపొందింది.
సానియా, కిచెనోక్ జంట.. ఏ దశలోనూ ప్రత్యర్థులకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.
మ్యాచ్‌ను ఈజీగా తమ ఖతాలో వేసుకున్నారు.