WorldWonders

3కోట్లు తక్కువ అయ్యారు

There is a great wall of population difference between genders in china

2019 సంవత్సరం అంతానికి చైనా జనాభా 140.05 కోట్లకు చేరుకుందని ఆ దేశ జాతీయ గణాంకాల విభాగం శుక్రవారం ప్రకటించింది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దేశంలో శిశు జననాలు ఎన్నడు లేనంతగా కనిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ జనాభా 140 కోట్లను దాటింది. చైనాలో గత మూడేళ్లుగా శిశు జననాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీని వల్ల చైనాలో స్త్రీ, పురుషుల సంఖ్య మధ్య వ్యత్యాసం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అక్కడ స్త్రీలకన్నా పురుషులు మూడు కోట్ల మంది ఎక్కువగా ఉన్నారు. స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం ఎక్కువైతే పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయన్న విషయాన్ని గ్రహించిన చైనా ప్రభుత్వం స్త్రీల సంతానాన్ని ప్రోత్సహించడం కోసం 40 ఏళ్లపాటు అమలు చేసిన ఏక సంతాన విధానాన్ని ఎత్తివేసింది. అయినప్పటికీ ఇప్పటికీ మూడు కోట్ల వ్యత్యాసం ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. శిశు జననాల సంఖ్య ప్రతి వెయ్యికి 10.48కి పడిపోయింది. అక్కడి మొత్తం జనాభాలో 18.1 శాతం మంది 60 ఏళ్లు దాటిన వారు ఉండడంతో పనిచేసే జనాభా సంఖ్య కూడా తగ్గిపోయింది. చైనా నిబంధనల ప్రకారం 16 నుంచి 59 ఏళ్ల వరకే పని చేయడానికి అవకాశం. 59 ఏళ్లు నిండగానే పదవీ విరమణ చేయాల్సిందే. 60 ఏళ్లు దాటిన సంఖ్య పెరగడంతో పనిచేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. భారత్‌ జనాభా 130 కోట్లకు చేరుకుందన్న విషయం తెల్సిందే.