Fashion

డార్క్ సర్కిల్స్ నిర్మూలనకు ఈ పండు వాడండి

Use This Fruit To Remove Dark Circles

బాగా మగ్గిన అరటిపండ్లను చివికిపోయాయని బయట పడేస్తున్నారా? అలాంటి అరటిపండుతో చర్మ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు.పండిన అరటిపండు చర్మ ఆరోగ్యానికి అడ్డుపడే అన్నిరకాల సమస్యలను తొలగిస్తుంది. మెరిసే చర్మాన్ని పొందటమే కాకుండా డార్క్‌ సర్కిల్స్‌ వంటి చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.పండిన అరటిపండులను బయట పడేయటానికి బదులుగా, వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్‌ని చర్మానికి వాడటం వల్ల సమస్యలను తగ్గించుకోవచ్చు.చివికిన అరటిపండును తీసుకొని, మూడు చెంచాల నిమ్మరసానికి కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి నేరుగా రాసి, పది నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత నీటితో కడిగేయాలి. ఈ సహజ ఫేస్‌మాస్క్‌, చర్మంలో ఉండే అదనపు నూనెలను తొలగిస్తుంది.పండిన అరటిపండును సగం కప్పు పెరుగు, అవకాడోలను కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ పేస్ట్‌ను వెంట్రుకలకు, తలపై చర్మానికి అప్లయి చేయాలి. ఇలా చేశాక 15 నుండి 20 నిమిషాల వరకూ వేచి ఉండి, చల్లటి నీటితో కడిగేయాలి. ఈ మాస్క్‌ వల్ల జుట్టు మృదువుగా, సున్నితంగా మారుతుంది.