Business

అమెరికా GMను కొనుగోలు చేసిన చైనా GM

China's Greatwall Motors Buys American General Motors Plant In India

భారత్‌లో విక్రయాలను నిలిపివేసిన అమెరికా కార్ల తయారీ సంస్థ జీఎం మోటార్స్‌ ఇండియా ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన గ్రేట్‌వాల్‌ మోటార్స్‌ అంగీకరించింది. ఈ ప్రస్తుతం చైనాలో అత్యధికంగా ఎస్‌యూవీలను విక్రయిస్తోంది ఈ సంస్థే. విదేశాల్లో మార్కెట్‌ను విస్తరించేందుకు గ్రేట్‌వాల్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి దీని కొనుగోలు పూర్తికావచ్చని భావిస్తున్నారు. దీనిని కొనుగోలు చేశాక.. భారత్‌లో కూడా గ్రేట్‌వాల్‌ వాహనాలను విక్రయాలను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే జీఎం ప్లాంట్‌ను కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ మొత్తం విలువ 250 మిలియన్‌ డాలర్ల నుంచి 300 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ‘‘భారత మార్కెట్‌ చాలా బలమైంది. ఇక్కడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు భారత్‌ పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. భారత మార్కెట్లో అడుగుపెట్టడం గ్రేట్‌వాల్‌ మోటార్‌కు గొప్ప ముందడుగు.’’ అని సంస్థ గ్లోబల్‌ స్ట్రాటజీ వైస్‌ ప్రెసిడెంట్‌ లీజింగ్‌షాంగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం చైనాలో ఎస్‌యూవీ మార్కెట్లో లీడర్‌గా ఉన్న ఈ సంస్థ హవల్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ బ్రాండ్లతో భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఫిబ్రవరిలో జరిగే దిల్లీ ఆటోషోలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగం మందకొడిగా ఉండటంతో కొత్త మార్కెట్లలోకి ప్రవేశించి విక్రయాలు పెంచుకోవాలనే వ్యూహాన్ని గ్రేట్‌వాల్‌ అనుసరిస్తోంది. దీంతో 2026నాటికి ప్రపంచలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించే అవకాశం ఉన్న భారత్‌ను ఎంచుకొంది.