మన తెలంగాణలోని ఆలంపూర్ జోగుళాంబ అమ్మవారి పేరు వింటేనే అనేకమంది భక్తుల హృదయాలు పరవశించి పోతాయి. అష్టాదశ శక్తిపీఠాలలో అయిదవది (సతీదేవి పైవరుస దంతాలు పడిన ప్రదేశం) అయిన ఈ క్షేత్రంలో మాఘమాసం (25వ తేది) ప్రారంభం నుంచీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆది దంపతుల కళ్యాణ సంరంభాలు అందరూ దర్శించదగ్గ వేళా విశేషమిది. ఇంకెందుకు ఆలస్యం, సందర్శనార్థం ఏర్పాట్లు చేసుకోవడమే తరువాయి. సప్తమి (ఫిబ్రవరి 1) వరకూ జరిగే ఈ వేడుకలలో వసంతపంచమి (30వ తేది) నాడు జోగులాంబ అమ్మవారి ‘నిజరూప దర్శనం’ కూడా ఉంటుంది. ‘ఆ రోజు ఆమెను కొలిస్తే సర్వపాపాలు హరించుకుపోతాయని’ శాస్ర్తాలు చెబుతున్నాయి. అదే రోజు అమ్మవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలోనే శంకరుడు బ్రహ్మదేవునికి బాలశివునిగా ప్రత్యక్షమైనాడని, బ్రహ్మే స్వయంగా లింగప్రతిష్ఠ చేసినందున ఇక్కడి స్వామి ‘బాలబ్రహ్మేశ్వరుని’గా ప్రసిద్ధి చెందాడని వేదపండితులు చెప్తారు. ఇక్కడి నవబ్రహ్మ ఆలయాలలో బ్రహ్మకు బదులు శివలింగాలే కనిపించడం విశేషం. కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రదేశంలో తుంగభద్ర ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నందున ఈ క్షేత్రాన్ని ‘దక్షిణకాశి’గానూ పిలుస్తారు
అప్పుడే జోగులాంబ నిజరూపదర్శనం
Related tags :